Revanth Reddy : టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసును సీబీఐకి అప్పగించాలి.. మంత్రి కేటీఆర్ ను విచారించాలి : రేవంత్ రెడ్డి

ఆధారాలు చెప్పిన ప్రతిపక్ష నేతలకు సిట్ ద్వారా నోటీసులు ఇవ్వడం దారుణం అన్నారు. టీఎస్పీఎస్పీ పేపర్ లీకేజ్ పై ఆందోళన చేస్తున్నవారిని ఆరెస్ట్ చేసి, వారిపై కేసులు నమోదు చేశారని పేర్కొన్నారు.

Revanth Reddy : టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసును సీబీఐకి అప్పగించాలి.. మంత్రి కేటీఆర్ ను విచారించాలి : రేవంత్ రెడ్డి

Revanth Reddy

Revanth Reddy : టీఎస్పీఎస్సీ(TSPSC) పేపర్ లీకేజ్ కేసుపై కాంగ్రెస్ ఈడీకి ఫిర్యాదు చేసింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy), ఇతర నేతలు ఈడీ(ED) కార్యాలయంలో ఫిర్యాడు చేశారు. ఈ కేసును దర్యాప్తు చేయాలని ఈడీ అధికారులను కోరారు. పేపర్ లీక్ కేసులో ఆర్థిక లావాదేవీలు జరిగాయని ఆరోపించారు. అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఈడీ చేత దర్యాప్తు జరిపించాలని ఫిర్యాదు చేశామని అన్నారు. ఆత్మ బలిధానాలతో తెలంగాణ ఏర్పడిందన్నారు. టీఎస్పీఎస్సీ సంస్థ దొంగలు, దోపిడీ దారులకు అడ్డాగా మారిందని విమర్శించారు. పరీక్షల నిర్వహణలో టీఎస్పీఎస్సీ విఫలమైందన్నారు.

పేపర్ లీక్ నిందితులను అమర వీరుల స్తూపం ముందు ఉరి తీసినా తప్పులేదని చెప్పారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల 2 వేల మంది విద్యార్థులు చనిపోయారని పేర్కొన్నారు. విద్యార్థులు చనిపోతుంటే రాష్ట్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదన్నారు. చాలా మంది నిరుద్యోగ యువత ప్రాణాలు కోల్పోతున్నారని వాపోయారు. ఎనిమిది ఏళ్ల తర్వాత గ్రూప్-1 ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చారని, కింది స్థాయి ఉద్యోగులు పేపర్ లీక్ చేయడం దుర్మార్గమన్నారు. దీనికి ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కానీ, ఇప్పటివరకు ముఖ్యమంత్రి బయటకు రాలేదన్నారు.

TSPSC paper leak: నాకు ఇచ్చినట్లే కేటీఆర్ కూ నోటీసులు ఇవ్వాలని ఫిర్యాదు చేశాను: రేవంత్ రెడ్డి

పైగా, ఆధారాలు చెప్పిన ప్రతిపక్ష నేతలకు సిట్ ద్వారా నోటీసులు ఇవ్వడం దారుణం అన్నారు. టీఎస్పీఎస్పీ పేపర్ లీకేజ్ పై ఆందోళన చేస్తున్నవారిని ఆరెస్ట్ చేసి, వారిపై కేసులు నమోదు చేశారని పేర్కొన్నారు. పేపన్ లీకేజీలో శంకర్ లక్ష్మి కీలక పాత్ర పోషించారి.. కాబట్టి ఏ -1 శంకర్ లక్ష్మి(సెక్షన్ ఆఫీసర్)పై కేసు నమోదు చేయాలన్నారు. ఈ కేసు విచారణకు సిట్ ను నియమించడం ద్వారా కేసును కప్పిబుచడమే అవుతుందన్నారు.

ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ వేశామని, ఈ కేసును సీబీఐ(CBI)కి అప్పగించాలని కోర్టును కోరామని తెలిపారు. ఇందులో పాల్గొన్న నేరగాళ్ళు కోట్ల రూపాయల ట్రాన్సక్షన్ జరిపినట్లు పేర్కొన్నారు. ఇతర దేశాల నుండి వచ్చి పరీక్షలు రాశారని తెలిపారు. ఢిల్లీలో ఉన్న డైరెక్టర్, హైదరాబాద్ లో జాయింట్ డైరెక్టర్ కు ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు. ఈ కేసులో 379, 420,120బి కింద కేసులు నమోదు చేశారని తెలిపారు. ఇప్పటివరకు సిట్ అధికారులు సీజ్ చేసిన వాటాన్నింటినీ ఈడీ అధికారులు స్వాదీనం చేసుకోవాలని కోరామని వెల్లడించారు.

Revanth Reddy : కేసీఆర్, కేటీఆర్ ప్రమేయం లేకుండా ఏ స్కామ్ కూడా జరగలేదు, ఆంధ్రా వ్యక్తికి ఉద్యోగం ఎలా ఇచ్చారు?-రేవంత్ రెడ్డి

లాలాగూడలో 1 నుండి 3 గంటల వరకు పరీక్షలు నిర్వహించారని తెలిపారు. మంత్రి కేటీఆర్(Minister KTR)ను విచారించాలని ఈడీని కోరినట్లు పేర్కొన్నారు. అధికారులు నివేదిక ఇవ్వనప్పుడు కేటీఆర్ కు పరీక్షలు రాసిన విద్యార్థుల డేటా ఎలా వచ్చిందని ప్రశ్నించారు. కటాఫ్ మార్కుల వివరాలు కేటీఆర్ కు ఎలా తెలుస్తున్నాయని నిలదీశారు. ఇచ్చిన ఫిర్యాదుఫై ఈడీ అధికారులు స్పందించిందని, చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని తెలిపారు.