Trs
Six TRS candidates unanimous : తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలో ఆరుగురు టీఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. కడియం శ్రీహరి, గుత్తా సుఖేందర్ రెడ్డి, బండా ప్రకాశ్, తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, కౌశిక్ రెడ్డి, వెంకట్రామిరెడ్డిలు రిటర్నింగ్ అధికారి నుంచి ఎన్నిక ధృవీకరణ పత్రాలను అందుకున్నారు.
తమకు అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. సీఎం కేసీఆర్ అన్ని వర్గాలకు సమన్యాయం చేశారని కొత్త ఎమ్మెల్సీలు పేర్కొన్నారు.
దేశంలోని ధాన్యమంతా కేంద్రమే కొనాలని కడియం శ్రీహరి డిమాండ్ చేశారు. ఆహార భద్రత కేంద్రం బాధ్యతేనని స్పష్టం చేశారు. మోదీ హయాంలో దేశ జీడీపీ తగ్గిపోయిందని విమర్శించారు.