Mekala Engagement
Telangana : నిశ్చితార్ధం కోసం సాధారణంగా ప్రైవేట్ బస్సులను బుక్ చేసి బంధువులను, స్నేహితులను తీసుకెళ్లడం తెలిసిందే. అయితే, తండ్రి కోరిక మేరకు ఓ వ్యక్తి రెండు విమానాల్లో గ్రామస్తులు, బంధువులను గోవాకు నిశ్చితార్ధం కార్యక్రమంకు తీసుకెళ్లాడు. ఈ ఘటన విమానాశ్రయం ఉద్యోగులను, ఇతర ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
నాగర్‌కర్నూల్‌కు చెందిన మేకల అయ్యప్ప కుమారుడు మేకల జగతి (జవహర్ నగర్ మాజీమేయర్ కావ్యకు సోదరుడు) నిశ్చితార్ధం ఫంక్షన్ గోవాలో జరిగింది. ఈ కార్యక్రమానికి కటుుంబ సభ్యులు, బంధువులతోపాటు గ్రామస్తులను సైతం విమానంలో గోవా తీసుకెళ్లాలని వాళ్ల తండ్రి మేకల అయ్యప్ప నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు విషయాన్ని కొడుకు జగపతికి తెలియజేశాడు. దీంతో తన తండ్రి కోరిక మేరకు తన గ్రామానికి చెందిన 500 మంది రైతు కుటుంబాలను, బంధువులను శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి విమానాల ద్వారా గోవాకు తరలించారు.
పెద్ద సంఖ్యలో మేకల జగపతి నిశ్చితార్ధం కోసం వెళ్లేందుకు విమానాశ్రయానికి గ్రామస్తులు, వారి బంధువులు వెళ్లారు. శనివారం రెండు విమానాల్లో కేవలం మేకల వారి బంధువులు, స్నేహితులు, గ్రామస్థులు మాత్రమే ఉండడంతో ఎయిర్ పోర్టు సిబ్బంది, ఉద్యోగులు ఆశ్చర్యానికి గురయ్యారు. తన తండ్రి కోరిక మేరకు వచ్చిన బంధువులు, స్నేహితులు, గ్రామస్తులకు ఈ సందర్భంగా జవహర్ నగర్ మాజీ మేయర్ మేకల కవ్య కృతజ్ఞతలు చెప్పారు. గ్రామస్తులందరికీ విమాన ప్రయాణం అవకాశం కల్పించాలనే తలంపుతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అయ్యప్ప, ఆయన కుమార్తె కావ్య పేర్కొన్నారు.