Weather Forecast: తెలంగాణలో నేడు మోస్తరు వర్షాలు.. రుతుపవనాల రాక ఎప్పుడంటే?

తెలంగాణలో నేడు పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. కోస్తాంధ్రపై 2.1 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. మరోవైపు బిహార్‌ నుంచి ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ మీదుగా...

Weather Forecast: తెలంగాణలో నేడు పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. కోస్తాంధ్రపై 2.1 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. మరోవైపు బిహార్‌ నుంచి ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ మీదుగా తమిళనాడు వరకు గాలులతో 1500 మీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి ఏర్పడింది. వీటి ప్రభావంతో తెలంగాణలో సోమవారం అక్కడక్కడా ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. అయితే వర్షాలు కురవని చోటు వేసవి ఉష్ణోగ్రతలు ప్రస్తుతం కంటే మూడు డిగ్రీలు అదనంగా నమోదు కానున్నాయి. ఆదివారం మధ్యాహ్నం అత్యధికంగా ఆదిలాబాద్‌ జిల్లా జైనథ్‌లో 45.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వేడి పెరిగి ప్రజలు ఉక్కపోతలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

Weather Report : చల్లని కబురు.. ముందే రానున్న నైరుతి రుతుపవనాలు

ఇదిలాఉంటే తెలంగాణలోని సిద్దిపేట, మహబూబ్‌నగర్‌, వనపర్తి, జోగులాంబ గద్వాల, ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, నిర్మల్‌, రంగారెడ్డి, నాగర్‌కర్నూల్‌, ములుగు, నారాయణపేట, వికారాబాద్‌ జిల్లాల్లో పలుచోట్ల గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. సోమవారం ఉదయం వరకు ఆయా జిల్లాల్లో ఈ పరిస్థితి ఉండే అవకాశం ఉంటుందని పేర్కొంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో16 జిల్లాల్లో వర్షం కురిసినట్టు టీఎస్‌డీపీఎస్‌ తెలిపింది. సిద్దిపేట జిల్లా రాంపూర్‌లో అత్యధికంగా 5.60 సెంటీమీటర్లు, రంగారెడ్డి జిల్లా పొద్దటూర్‌లో 5.45, రాజన్న సిరిసిల్ల జిల్లా గజసింగారంలో 4.40, సంగారెడ్డి జిల్లా పాశమైలారంలో 3.93, రుద్రారం (గీతం)లో 3.80 సెంటీమీటర్ల, మహబూబ్ నగర్ జిల్లాలో 2.2 సెం.మీ వర్షపాతం నమోదైంది.

Weather Alert: తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు, రేపు మోస్తరు వర్షాలు

రాబోయే 24గంటల్లో అండమాన్‌ నికోబార్‌ దీవులకు రుతుపవనాలు వస్తాయని, ఆ తర్వాత బంగాళాఖాతం, హిందూ మహాసముద్రంలో విస్తరించి ఈ నెలాఖరులోగా కేరళను తాకుతాయని వాతావరణ శాఖ తెలిపింది. అయితే ఈ రుతుపవనాలు జూన్‌ 8లోగా తెలంగాణలోకి ప్రవేశిస్తాయని వివరించింది. ప్రస్తుతం వేసవి ఎండలు మండిపోతున్నాయి. ఈ క్రమంలో రుతుపవనాల రాక ప్రారంభమైతే ఎండల తీవ్రత తగ్గే అవకాశం ఉంది.

ట్రెండింగ్ వార్తలు