Weather Alert: తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు, రేపు మోస్తరు వర్షాలు

తెలంగాణ రాష్ట్రంలో భిన్న వాతావరణం నెలకొంది. కొన్ని ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలతో ఎండ భగభగమంటూ ఉక్కపోతతో ప్రజలను ఇబ్బంది పెడుతుంటే..

Weather Alert: తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు, రేపు మోస్తరు వర్షాలు

Rains In Telangana

Weather Alert: తెలంగాణ రాష్ట్రంలో భిన్న వాతావరణం నెలకొంది. కొన్ని ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలతో ఎండ భగభగమంటూ ఉక్కపోతతో ప్రజలను ఇబ్బంది పెడుతుంటే.. మరికొన్ని ప్రాంతాల్లో ఆహ్లాదకరమైన చల్లని వాతావరణంతో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. ఇక ఈరోజు, రేపు(శని-ఆది వారాలు) తెలంగాణలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది.

Weather alert: తెలంగాణలో అకాల వర్షం.. అన్నదాత విలవిల..

మహారాష్ట్రలోని విదర్భ నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా 900మీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో తెలంగాణలో శని, ఆదివారాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఇక ఒకవైపు శుక్రవారం హైదరాబాద్ లో ఒకటి రెండు చోట్లతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. అత్యధికంగా నల్గొండ జిల్లాలోని శాలిగౌరారంలో(2.2సెం.మీ) వర్షం నమోదైంది.

Weather Forecast : ఉత్తర తెలంగాణలో వడగాలులు, కొన్ని జిల్లాల్లో వానలు

మరోవైపు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మూడు నుంచి నాలుగు డిగ్రీలు అధికంగా నమోదవుతున్నట్టు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఇక, ఏపీలో ఎండలు దంచి కొడుతున్నాయి. వర్ష సూచనగా మబ్బులు, ఉరుములు, మెరుపులతో వాతావరణం సాయంత్రానికి చల్లబడినట్లు కనిపించినా మళ్ళీ మరుసటి ఉదయానికి భానుడు భగ్గుమంటూ సిద్దమవుతున్నాడు.