Weather Forecast : ఉత్తర తెలంగాణలో వడగాలులు, కొన్ని జిల్లాల్లో వానలు

ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాలలో రాగల మూడు రోజులు వడగాలులు వీచే అవకాశం ఉందని, మరికొన్ని జిల్లాలలో వానలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Weather Forecast : ఉత్తర తెలంగాణలో వడగాలులు, కొన్ని జిల్లాల్లో వానలు

rains in telangana

Weather Forecast : ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాలలో రాగల మూడు రోజులు వడగాలులు వీచే అవకాశం ఉందని, మరికొన్ని జిల్లాలలో వానలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.  ఉదయం 10 దాటిన తర్వాత బయటకు రావాలంటే  ప్రజలు భయపడుతున్నారు.   బుధవారం అత్యధికంగా ఆదిలాబాద్‌ జిల్లా జైనద్‌లో 45.7, జగిత్యాల జిల్లా ఐలాపూర్‌లో 45.1 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ ఏడాది ఇప్పటివరకూ రాష్ట్రంలో నమోదైన గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఇవి. మరో పది జిల్లాల్లో 44.8 నుంచి 43.9 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

తూర్పు విదర్భ నుండి తెలంగాణ, ఉత్తర ఇంటీరియర్  కర్ణాటక మీదుగా,  దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక వరకు సగటు సముద్ర మట్టం నుంచి 0.9 కిలోమీటర్లు ఎ్తతు  వద్ద ఉపరితల ద్రోణి కొనసాగుతోందని హైదరాబాద్‌లోని  వాతావరణ శాఖ తెలిపింది.
Also Read : Summer Trains : హైదరాబాద్-తిరుపతి మధ్య వేసవి ప్రత్యేక రైళ్లు
దీని ప్రభావం వలన  రాగల మూడురోజులు తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో ఉరుములు మెరుపులు మరియు ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని  వాతావరణ శాఖ తెలిపింది.  అదే సమయంలో ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, కొమురం భీం, మంచిర్యాల, నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, మరియు రాజన్న సిరిసిల్ల జిల్లాలలో అక్కడక్కడ వడగాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.