Weather alert: తెలంగాణలో అకాల వర్షం.. అన్నదాత విలవిల..

తెలంగాణలోని పలు జిల్లాలో బుధవారం ఉదయం భారీ వర్షం కురిసింది. తూర్పు విదర్భ నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో...

Weather alert: తెలంగాణలో అకాల వర్షం.. అన్నదాత విలవిల..

Heavy Rain

Weather alert: తెలంగాణలోని పలు జిల్లాలో బుధవారం ఉదయం భారీ వర్షం కురిసింది. తూర్పు విదర్భ నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలోని పలు జిల్లాల్లో తెల్లవారు జామున ఉరుములు, ఈదురు గాలులతో వర్షం పడింది. భారీగా ఈదురు గాలులు వీయడంతో పలు ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి నల్లగొండ జిల్లాతో పాటు నిర్మల్, తదితర జిల్లాల్లో అకాల వర్షం కురిసింది.

Hyderabad Rains: భాగ్యనగరంలో దంచికొట్టిన వర్షం.. ఈదురు గాలులకు కూలిన హోర్డింగ్స్..

అకాల వర్షం కారణంగా రైతులు తీవ్రంగా నష్టం వాటిల్లే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం మిర్చి, ధాన్యం, మొక్కజొన్న తదితర పంటల ఉత్పత్తులు కొల్లాల్లో ఉన్నాయి. ఈ క్రమంలో అకాల వర్షం రావడంతో అన్నదాతలు ఆందోళణ చెందుతున్నారు. దీనికితోడు పలు ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాల్లో వర్షం కారణంగా ధాన్యం తడిసింది. లక్సెట్టిపేట వ్యవసాయశాఖ మార్కెట్ యార్డులో ధాన్యం తడిచి ముద్ద కావడంతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. మరోవైపు నిర్మల్ జిల్లా దుస్తరాబాద్, కడెం, జన్నారం మండలాల్లో రాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో మామిడి కాయలు నేలరాలాయి. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం తడిసి ముద్దయింది. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. యాద్రిద్రి జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. వర్షం కారణంగా యాద్రాద్రి దేవస్థానంకు వెళ్లే ఘాట్ రోడ్డులో ఆర్టీసీ బస్సు ఉచిత సేవలు నిలిచిపోయాయి. దీంతో కాలినడకన భక్తులు కొండపైకి చేరుకున్నారు. ఈదురుగాలులు కారణంగా ఆలయం వద్ద వేసిన చలువ పందిళ్లు పడిపోయాయి.  స్వామివారి క్యూ లైన్ నందు భారీగా వర్షపు నీరు చేరడంతో దర్శనానికి వెళ్లే వారికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

AP Rain Alert : ఏపీలో ఆ జిల్లాల్లో పిడుగులు పడొచ్చు.. బీ అలర్ట్..!

అత్యధిక వర్షపాతం నమోదైన ప్రాంతాలు..
సిద్ధిపేట జిల్లా దుబ్బాక మండలంలో 10 సెం.మీ, కొమరం బీం జిల్లా బిజ్జూరులో 7.7 సెం.మీ, హైదరాబాద్ లోని మారేడుపల్లిలో 7.2 సెం.మీ, కొమరం బీం జిల్లా చింతలమన్నెపల్లి లో 6.8 సెం.మీ, హైదరాబాద్ లోని మూసాపేట్ లో 6.7 సెం.మీ, మంచిర్యాల జిల్లా తాండూరు మండలంలో 6.5 సెం.మీ వర్షపాతం నమోదైంది. ఇదిలా ఉంటే రాబోయే రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. పల్నాడు జిల్లా, నంద్యాల జిల్లాతో పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. అలాగే రాష్ట్రవ్యాప్తంగా అనేక చోట్ల వానలు కురుస్తున్నాయి.

Ukraine Crisis: అదంతా కట్టుకథే.. ‘ఘోస్ట్‌ ఆఫ్‌ కీవ్‌’ పాత్రపై స్పష్టత ఇచ్చిన ఉక్రెయిన్ సైన్యం

హైదరాబాద్ లో వర్షపాతం నమోదు ఇలా..
బుధవారం ఉదయం భాగ్యనగరంలో వర్షం దంచికొట్టింది. సికింద్రాబాద్‌లోని సీతాఫల్ మండి‌లో 7.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదేవిధంగా బంసిలాల్‌పేట్‌లో 6.7 సెంటీమీటర్లు, వెస్ట్ మారేడ్‌పల్లిలో 6.1 సెంటీమీటర్లు, అల్వాల్లో 5.9 సెంటీమీటర్లు, ఎల్బీ నగర్‌లో 5.8. సెంటీమీటర్లు, గోషామహల్, బాలానగర్‌లో 5.4 సెంటీమీటర్లు, ఏఎస్ రావు నగర్లో 5.1 సెంటిమీటర్లు, బేగంపేటలోని పాటిగడ్డలో 4.9 సెంటీమీటర్లు, మల్కాజ్ గిరిలో 4.7సెంటీమీటర్లు, సరూర్‌నగర్, ఫలక్నామా‌లో 4.6 సెంటి మీటర్లు, గన్ ఫౌండ్రీలో 4.4 సెంటీమీటర్లు, కాచిగూడ, సికింద్రాబాద్‌లో 4.3 సెంటీమీటర్లు, చార్మినార్‌లో 4.2 సెంటీమీటర్లు, గుడిమల్కాపూర్, నాచారంలో 4.1 సెంటి మీటర్లు, అంబర్పేట్‌లో 4 సెంటీమీటర్లు, అమీర్‌పేట్ సంతోష్ నగర్‌లో 3.7 సెంటీమీటర్లు, ఖైరతాబాద్‌లో 3.6 సెంటీమీటర్లు, బేగంబజార్, హయత్ నగర్, చిలకానగర్‌లో 3.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.