Ukraine Crisis: అదంతా కట్టుకథే.. ‘ఘోస్ట్‌ ఆఫ్‌ కీవ్‌’ పాత్రపై స్పష్టత ఇచ్చిన ఉక్రెయిన్ సైన్యం

Ukraine Crisis: అదంతా కట్టుకథే.. ‘ఘోస్ట్‌ ఆఫ్‌ కీవ్‌’ పాత్రపై స్పష్టత ఇచ్చిన ఉక్రెయిన్ సైన్యం

Gost Of Kivy

Ukraine Crisis: ఉక్రెయిన్ – రష్యా యుద్ధంలో ఓ ఫైలెట్ వీరోచిత పోరాటం చేశాడని, 40 రష్యన్ యుద్ధ విమానాలను కూల్చేసిన అతను కొద్దిరోజుల క్రితం మృతిచెండాదని, అతన్ని ఉక్రెయిన్ ప్రజలు ఘోస్ట్ ఆఫ్ కీవ్ అని కీర్తిస్తున్నట్లు వార్తా పత్రికల్లో కథనాలు ప్రచురితమయ్యాయి. ఈ వార్త ప్రపంచ వ్యాప్తంగా మారుమోగిపోయింది. 40 రష్యన్ యుద్ధ విమానాలు కూల్చిన వ్యక్తిని ఉక్రెయిన్ ప్రజలు కీర్తించారు. తాజాగా ఉక్రెయిన్ సైన్యం కీలక ప్రకటన చేసింది. ఘోస్ట్ ఆఫ్ కీవ్ పాత్ర కేవలం కల్పితం మాత్రమేనని ఉక్రెయిన్ వైమానిక దళ కమాండర్ తన ఫేస్ బుక్ ద్వారా తెలియజేశారు. ఘోస్ట్ ఆఫ్ కీవ్ పాత్ర ఉక్రెయిన్ ప్రజలు సృష్టించిన పేరేనని ఆయన తెలిపారు. దీంతో పదిరోజులుగా ప్రపంచ వ్యాప్తంగా మారుమోగుతున్న ఘోస్ట్ ఆఫ్ కీవ్ కు తెరపడినట్లయింది.

Russia-Ukraine war: యుద్ధ భూమిలో ఏంజెలీనా జోలీ పర్యటన.. అక్కడి పరిస్థితిని చూసి ఆమె ఏమన్నారంటే..

ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య ప్రారంభమైన తొలి రోజుల్లో ‘ఘోస్ట్‌ ఆఫ్‌ కీవ్‌’ పేరు వినిపించింది. రష్యా యుద్ధ విమానాలను ఓ ఉక్రెనియన్‌ ఫైటర్‌ పైలట్‌ క్షణాల్లో కూల్చేసి ముచ్చెమటలు పట్టిస్తున్నాడని, తొలిరోజు ఆరు రష్యా  యుద్ధ విమానాలను కూల్చేశాడని పత్రికల్లో కథనాలు వచ్చాయి. అయితే అతడు కొద్దిరోజుల క్రితం చనిపోయినట్లు.. అతన్ని ఉక్రెయిన్ ప్రజలు ‘ఘోస్ట్‌ ఆఫ్‌ కీవ్‌’గా పేర్కొనడం ప్రారంభించారు. ఆ ఘోస్ట్‌ పేరును మేజర్‌ స్తెపాన్‌గా ఇటీవల కొన్ని పత్రికలు ప్రకటించాయి. అతను చిన్నప్పుడు తన గ్రామం మీదుగా ఆకాశంలో ఎగురుతున్న ఫైటర్ జెట్‌లను చూసి పైలట్ కావాలనుకునేవాడని అక్కడి ప్రజలు పేర్కొన్నారు.

Russia-Ukraine War : రష్యా సైనికుల్ని అడ్డుకోవటానికి గ్రామాన్ని నీటితో ముంచేసిన యుక్రెయిన్ వాసులు

మరోవైపు ఉక్రెయిన్‌ ప్రభుత్వం స్తెఫాన్ మరణం గురించి ఎలాంటి సమంచారం ఇవ్వదని తల్లిదండ్రులు పేర్కొన్నట్లు పలు ఆంగ్ల పత్రికలు పేర్కొన్నాయి. ఉక్రెయిన్‌ ధైర్య సాహసాలు ప్రంపంచానికి అవగతమయ్యేలా వీరోచితంగా పోరాడి గొప్ప వీర మరణం పొందాడని, స్తెఫాన్ మరణించినా అతని ధైర్య సాహసాలు మాత్రం చిరస్థాయిగా నిలిచిపోతాయని ఉక్రెయిన్ ప్రజలు కీర్తించారు. ఉక్రెయిన్ లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఇదే చర్చ సాగింది. తాజాగా ఉక్రెయిన్ సైన్యం ఇదంతా కట్టుకథ అంటూ కొట్టిపారేసింది.