Hyderabad Rains: భాగ్యనగరంలో దంచికొట్టిన వర్షం.. ఈదురు గాలులకు కూలిన హోర్డింగ్స్..

భాగ్యనగరంలో భారీ వర్షం కురిసింది. తెల్లవారు జామున 5.30 గంటల నుంచి ఉరుములు, మెరుపులతో పాటు ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులతో పలు ప్రాంతాల్లో హోర్డింగ్స్ కుప్పకూలిపోయాయి..

Hyderabad Rains: భాగ్యనగరంలో దంచికొట్టిన వర్షం.. ఈదురు గాలులకు కూలిన హోర్డింగ్స్..

Rain In Hydrabad

Hyderabad Rains: భాగ్యనగరంలో భారీ వర్షం కురిసింది. తెల్లవారు జామున 5.30 గంటల నుంచి ఉరుములు, మెరుపులతో పాటు ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులతో పలు ప్రాంతాల్లో హోర్డింగ్స్ కుప్పకూలిపోయాయి. పలు ప్రాంతాల్లో చెట్లు విరిగి రోడ్లపై పడ్డాయి. దీంతో ఉదయం వేళల్లో తమతమ పనులకు బయటకు వెళ్లేందుకు వచ్చిన వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చార్మినార్, మలక్ పేట్, బహదూర్ పురాతో పాటు చాదర్ ఘాట్‌లో హోర్డింగ్‌లు కూలిపోయాయి. దీనికితోడు భారీ వర్షానికి వర్షపునీరు ఎక్కడికక్కడ రోడ్ల పై నిలిచిపోయింది. రంగంలోకి దిగిన డీఆర్ఎఫ్ బృందాలు, 19 జిహెచ్ఎంసి డిజాస్టర్ బృందాలు మోటార్ల సాయంతో నీటిని తొలగించారు. భారీ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యయి. బేగం బజార్, ఉస్మాన్ గంజ్, అఫ్జల్ గంజ్, గోషామహల్ లో పలు కాలనీలు నీటమునిగాయి. ఎల్బీనగర్, మన్సురాబాద్, చైతన్యపురి, సరూర్ నగర్ లోని పలు కాలనీల్లోకి వర్షపు నీరు ఇళ్లలోకి వచ్చిచేరింది. అకాల వర్షంతో నగరవాసుల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భారీ వర్షం కారణంగా వర్షపునీరు మలక్ పేట్ రైల్వే బ్రిడ్జి కిందకి చేరడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

Hyderabad Rains: హైదరాబాద్‌లో భారీ వర్షం.. రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు సూచన

ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. జూబ్లీహిల్స్‌,యూసుఫ్‌గూడ, అమీర్‌పేట, మలక్‌పేట, దిల్‌సుఖ్‌నగర్‌, చైతన్యపురి, కొత్తపేట, ఎల్బీనగర్‌, వనస్థలిపురం తదితర ప్రాంతాల్లో పవర్‌ కట్‌ అయింది. పంజాగుట్ట కూడలి వద్ద భారీగా వర్షపు నీరు నిలిచింది. ఖైరతాబాద్‌, బంజారాహిల్స్‌ కూడలి వద్ద మోకాళ్ల లోతులో నీరు చేరింది. యూసుఫ్‌గూడ నుంచి మైత్రీవనం వెళ్లే మార్గంలో స్టేట్ హోమ్ వద్ద రోడ్డుపై చెట్టుకొమ్మలు విరిగిపడ్డాయి. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. ఎల్బీనగర్‌ వద్ద రోడ్డుపై ఏర్పడిన గుంతలో ఓ కారు ఇరుక్కుపోయింది. దాన్ని బయటకు తీసేందుకు జీహెచ్‌ఎంసీ డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది యత్నిస్తున్నారు. ఎల్బీనగర్‌ ఫ్లై ఓవర్‌ వద్ద ఓ ఆర్టీసీ బస్సు వరదనీటిలో చిక్కుకుంది.

Ukraine Crisis: అదంతా కట్టుకథే.. ‘ఘోస్ట్‌ ఆఫ్‌ కీవ్‌’ పాత్రపై స్పష్టత ఇచ్చిన ఉక్రెయిన్ సైన్యం

నగరంలో వర్షపాతం నమోదు ఇలా..
బుధవారం ఉదయం భాగ్యనగరంలో వర్షం దంచికొట్టింది. సికింద్రాబాద్‌లోని సీతాఫల్ మండి‌లో 7.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదేవిధంగా బంసిలాల్‌పేట్‌లో 6.7 సెంటీమీటర్లు, వెస్ట్ మారేడ్‌పల్లిలో 6.1 సెంటీమీటర్లు, అల్వాల్లో 5.9 సెంటీమీటర్లు, ఎల్బీ నగర్‌లో 5.8. సెంటీమీటర్లు, గోషామహల్, బాలానగర్‌లో 5.4 సెంటీమీటర్లు, ఏఎస్ రావు నగర్లో 5.1 సెంటిమీటర్లు, బేగంపేటలోని పాటిగడ్డలో 4.9 సెంటీమీటర్లు, మల్కాజ్ గిరిలో 4.7సెంటీమీటర్లు, సరూర్‌నగర్, ఫలక్నామా‌లో 4.6 సెంటి మీటర్లు, గన్ ఫౌండ్రీలో 4.4 సెంటీమీటర్లు, కాచిగూడ, సికింద్రాబాద్‌లో 4.3 సెంటీమీటర్లు, చార్మినార్‌లో 4.2 సెంటీమీటర్లు, గుడిమల్కాపూర్, నాచారంలో 4.1 సెంటి మీటర్లు, అంబర్పేట్‌లో 4 సెంటీమీటర్లు, అమీర్‌పేట్ సంతోష్ నగర్‌లో 3.7 సెంటీమీటర్లు, ఖైరతాబాద్‌లో 3.6 సెంటీమీటర్లు, బేగంబజార్, హయత్ నగర్, చిలకానగర్‌లో 3.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.