Dharani Guidelines : ధరణి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం మార్గదర్శకాలు.. అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

ధరణిని అడ్డం పెట్టుకుని ఆక్రమించుకున్న ప్రభుత్వ భూముల విషయంలో కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్.

Dharani Guidelines

Dharani Guidelines : ధరణిలో సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. పోర్టల్ లో సమస్యల పరిష్కారానికి మార్చి 1 నుంచి వారం రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా సదస్సులు నిర్వహించబోతోంది ప్రభుత్వం. ఈ నెల 24న ధరణిపై రివ్యూలో.. ధరణి అప్లికేషన్లను వెంటనే క్లియర్ చేయాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ఒక టైమ్ లైన్ విధించి ఆలోపు పెండింగ్ అప్లికేషన్లను పూర్తి చేయాలన్నారు. ధరణిని అడ్డం పెట్టుకుని ఆక్రమించుకున్న ప్రభుత్వ భూముల విషయంలో కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్.

ఆధార్ నెంబర్లు, పేర్లు, ఫోటో మిస్ మ్యాచ్ వంటి అప్లికేషన్లను త్వరగా పూర్తి చేయాలన్న సీఎం రేవంత్.. అసైన్డ్ ల్యాండ్ సమస్యలు త్వరగా పరిష్కరించాలంటూ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. కరెక్షన్ చేసిన అప్లికేషన్ల వివరాలను ఎలక్ట్రానిక్స్ రికార్డ్స్ లో భద్రపరచాలని సూచించారు.

ధరణిలో సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేయగా.. కలెక్టర్లకు గైడ్ లైన్స్ జారీ చేసింది సీసీఎల్ఏ. ధరణి అప్లికేషన్లను వెంటనే క్లియర్ చేయాలన్న సీఎం ఆదేశాలకు అనుగుణంగా కొన్ని సూచనలు చేసింది ధరణి కమిటీ. తహసీల్దార్, ఆర్డీవో, అడిషనల్ కలెక్టర్లు, కలెక్టర్ల సమక్షంలో కమిటీలు వేయాలని సూచించారు.

Also Read : ఎమ్మెల్సీ ఎన్నికపై బీఆర్ఎస్‎‎ దృష్టి.. పరిశీలనలో వీరి పేర్లు..

 

ట్రెండింగ్ వార్తలు