Paddy Provcuremeny
Paddy Procurement: తెలంగాణ ధాన్యం కొనుగోళ్ల పంచాయితీ తేల్చేందుకు ఆరు రోజులుగా ఢిల్లీలోనే బస చేశారు తెలంగాణ మంత్రులు. ప్రస్తుత ఏడాది ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లపై లిఖితపూర్వక హామీ కోసం ఎదురు చూస్తున్నారు. ఖరీఫ్ సీజన్‌లో 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కంటే అధికంగా సేకరిస్తామని కేంద్రం చెప్పిన మాటలను లిఖితపూర్వకంగా ఇవ్వాలని కోరుతున్నారు.
మంగళవారం కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌ని కలిసిన సమయంలో ఒకటి రెండు రోజుల్లో లిఖితపూర్వకంగా హామీ ఇస్తామని అన్నారు. కేంద్రం ప్రకటన కోసం ఎదురుచూస్తూనే ఢిల్లీ వేదికగా బీజేపీ – టీఆర్ఎస్ నేతల మధ్య రాజకీయ విమర్శలు, ప్రతివిమర్శలు కొనసాగుతున్నాయి.
వ్యవసాయశాఖమంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డితో పాటు..గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, జగదీశ్వర్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, వేముల ప్రశాంత్ రెడ్డి పలువురు ఎంపీలు ఢిల్లీలో హామీ కోసం ఎదురుచూస్తున్నారు. వానాకాలం పంట, అదనపు ధాన్యం కొనుగోలుపై కేంద్రం నుంచి స్పష్టత, యాసంగిలో ధాన్యం కొనుగోళ్ల పై స్పష్టత అంశాలపై మంత్రులు… కేంద్ర మంత్రులతో చర్చల కోసం ఎదురుచూస్తున్నారు.
………………………………………. : దేశవ్యాప్తంగా 250 దాటిన ఒమిక్రాన్ కేసులు