Omicron Cases : దేశవ్యాప్తంగా 250 దాటిన ఒమిక్రాన్‌ కేసులు

దేశంలోని కోవిడ్‌ పరిస్థితులపై ప్రధాని మోదీ ఇవాళ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Omicron Cases : దేశవ్యాప్తంగా 250 దాటిన ఒమిక్రాన్‌ కేసులు

India (1)

Omicron cases across the india : దేశంలోనూ ఒమిక్రాన్‌ కేసులు రాకెట్‌ స్పీడ్‌లో దూసుకుపోతున్నాయి. ప్రతీరోజు భారీ సంఖ్యలో ఒమిక్రాన్‌ కేసులు బయటపడుతున్నాయి. దేశవ్యాప్తంగా ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 250 దాటింది. దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో 65 ఒమిక్రాన్‌ కేసులున్నాయి. ఢిల్లీలో 64, తెలంగాణలో 24 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. రాజస్థాన్ 21, కర్ణాటక 19, కేరళ 15, గుజరాత్ 14, జమ్మూకాశ్మీర్ 3,ఉత్తరప్రదేశ్ 2, ఏపీలో 2, ఒడిశా 2, లడఖ్ 1, చండీగఢ్ 1, తమిళనాడు 1, పశ్చిమ బెంగాల్‌లో 1 ఒమిక్రాన్ వేరియంట్ కేసు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.

దేశంలో నెలకొన్న కోవిడ్‌ పరిస్థితులపై ప్రధాని మోదీ ఇవాళ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. కేంద్ర మంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు హాజరయ్యే ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ భేటీలో క్రిస్మస్‌, న్యూ ఇయర్‌ వేడుకలపై ఆంక్షలు విధించే అంశాన్ని పరిశీలించే ఛాన్స్‌ ఉంది. అంతేగాకుండా బూస్టర్‌ అంశం కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

CM Jagan : ఆజాదీకా అమృత్ మహోత్సవ్.. ప్రధాని మోదీకి సీఎం జగన్‌ సూచనలు

ఒమిక్రాన్‌ విజృంభణతో రాష్ట్రాలు ఆంక్షల బాట పట్టాయి. ఇప్పటికే కర్ణాటక, మహారాష్ట్ర క్రిస్మస్‌, నూతన సంవత్సర వేడుకలపై నిషేధం విధించగా.. తాజాగా ఆ జాబితాలో ఢిల్లీ కూడా చేరింది. ఒమిక్రాన్‌ వ్యాప్తితో అప్రమత్తమైన కేజ్రీవాల్‌ ప్రభుత్వం క్రిస్మస్‌, న్యూ ఇయర్‌ వేడుకలపై నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

మరోవైపు హర్యానా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. వ్యాక్సిన్‌ వేయించుకోని వ్యక్తులు బహిరంగ ప్రదేశాలలో తిరగడాన్ని నిషేధించింది. ఈ కొత్త నిబంధన జనవరి 1, 2022 నుంచి అమలులోకి వస్తుంది.