CM Jagan : ఆజాదీకా అమృత్ మహోత్సవ్.. ప్రధాని మోదీకి సీఎం జగన్‌ సూచనలు

సామాజిక ఆర్థికాభివృద్ధిలో ఇంధన రంగం చాలా కీలక పాత్ర పోషిస్తుందన్నారు సీఎం జగన్. గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారాలు పెరిగి భవిష్యత్తు తరాలకు ముప్పు వాటిల్లుతోందన్నారు.

CM Jagan : ఆజాదీకా అమృత్ మహోత్సవ్.. ప్రధాని మోదీకి సీఎం జగన్‌ సూచనలు

Jagan (6)

Jagan Suggestions to Modi : ఆజాదీకా అమృత్ మహోత్సవ్ సందర్భంగా ప్రధాని మోదీకి ఏపీ సీఎం జగన్‌ కీలక సూచనలు చేశారు. ముఖ్యంగా విద్యుత్ రంగం ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు పేద, ధనిక అంతరాలు పెరుగుతుండడంపై మాట్లాడారు. వర్తమాన అవసరాలు ఆర్థిక ప్రగతి ద్వారానే తీర్చబడుతున్నప్పటికీ, భవిష్యత్తు తరాల వారి అవసరాలను తీర్చుకునే సామర్థ్యంలో రాజీపడకుండా ఉండటం అత్యవసరమన్నారు సీఎం జగన్.

సామాజిక ఆర్థికాభివృద్ధిలో ఇంధన రంగం చాలా కీలక పాత్ర పోషిస్తుందన్నారు. గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారాలు పెరిగి భవిష్యత్తు తరాలకు ముప్పు వాటిల్లుతోందన్నారు. బొగ్గు ఆధారిత విద్యుదుత్పత్తికి స్వస్తి పలికాలన్నారు ముఖ్యమంత్రి. అలాగే దేశంలోని పేదలకు ఆర్థిక వృద్ధి తగినంతగా చేరలేదన్నారు జగన్‌. ఆదాయ అసమానత వల్ల గ్రామీణ రుణభారం పెరుగుతుందని, కొనుగోలు శక్తి తగ్గుతుందన్నారు

CM Jagan : నేటి నుంచి సీఎం జగన్‌ కడప జిల్లా పర్యటన

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ సందర్భంగా ఏర్పాటైన కమిటీతో ప్రధాని మోదీ వివిధ రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సమావేశంలో ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌, సీఎం జగన్‌, తెలంగాణ గవర్నర్‌ తమిళిసై, సీఎం కేసీఆర్‌, వివిధ రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, ప్రముఖులు పాల్గొన్నారు.

ప్రధాని మోదీ తీసుకున్న చర్యల్లో ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ అత్యంత ప్రశంసనీయమైందన్నారు సీఎం జగన్‌. ఈ వేడుకల్లో భాగంగా ఏపీలోని స్వాతంత్య్ర సమర యోధులను గౌరవించుకునే అవకాశం తనకు కలిగిందన్నారు.