Telangana bamboo power: వెదురు నుంచి కరెంటు ఉత్పత్తి ..దేశంలోనే తెలంగాణ ఉద్యానశాఖ తొలి ప్రయత్నం

‘వెదురు నుంచి విద్యుత్తును ఉత్పత్తి చేస్తే..?’ అనే ఆలోచన చేసింది తెలంగాణ ఉద్యానశాఖ.

successful manufacture of bamboo pellets in bhainsa : నీటినుంచి, బొగ్గు నుంచి ఆఖరికి గాలి నుంచికూడా విద్యుత్ ఉత్పత్తి చేస్తారని తెలుసు.కానీ తెలంగాణ ప్రభుత్వం మరో కొత్త విధానంతో విద్యుత్ ఉత్పత్తి చేయటానికి యత్నిస్తోంది. విద్యుత్ ఉత్పత్తి కోసం కొత్త పద్ధతి కోసం యత్నిస్తోంది. ‘వెదురు నుంచి విద్యుత్తును ఉత్పత్తి చేస్తే..?’ అనే ఆలోచన చేసింది తెలంగాణ ఉద్యానశాఖ. నిర్మల్‌ జిల్లా భైంసాలో 15 ఎకరాల్లో 2019 నుంచే విద్యుత్తు ఉత్పత్తికి అవసరమైన భీమా బ్యాంబూ రకం వెదురు చెట్ల (పొదలు)ను పెంచుతోంది.

ఏపుగా పెరిగిన వెదురు కర్రల నుంచి ప్రత్యేక యంత్రాల ద్వారా ఇప్పటికే వెదురు పెల్లెట్స్‌ను విజయవంతంగా తయారుచేసింది. త్వరలోనే జాతీయ థర్మల్‌ విద్యుత్తు కేంద్రంలో బొగ్గుకు బదులుగా ఈ పెల్లెట్స్‌ను వినియోగించి..పరీక్షించనున్నారు. ఇప్పటికే చైనా, జర్మనీ, అమెరికా వంటి అనేక దేశాల్లో వెదురు పెల్లెట్స్‌తో థర్మల్‌ విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నారు. మన దేశంలో కూడా థర్మల్‌ విద్యుత్తు ఉత్పత్తిలో వెదురు పెల్లెట్స్‌ను 7% తప్పనిసరిగా వినియోగించాలని కేంద్రం నిర్ణయించింది.

ఈ లెక్కన చూస్తే తెలంగాణలో ఉత్పత్తి చేస్తున్న థర్మల్‌ విద్యుత్తుకు ఏటా 67 లక్షల టన్నుల పెల్లెట్స్‌ అవసరమని అధికారుల అంచనా వేశారు. ఇంత భారీ మొత్తంలో డిమాండ్‌ ఉండటంతో దాదాపు 2.80 లక్షల ఎకరాల్లో వెదురు సాగును ప్రోత్సహించాలని ఉద్యానశాఖ నిర్ణయించింది.వెదురు ఉత్పత్తికి ఎకరాకు అయ్యే ఖర్చు రూ.50 వేలు పెట్టాల్సి ఉంటుంది. ఆదాయం మాత్రం ఎకరాకు రూ.2లక్షలు వస్తుంది.

ఉత్పత్తి అయ్యే వెదురు కర్ర 30 టన్నులు
ఉత్పత్తి అయ్యే పెల్లెట్స్‌ 20 టన్నులు
ఏడాదికి నికర ఆదాయం రూ.2 లక్షలు
ఎకరాకు 2 లక్షల ఆదాయం
ప్రారంభంలో ఎకరాకు రూ.50 వేలు పెట్టుబడి ..
ఎకరానికి 30 టన్నుల వెదరు కర్ర ఉత్పత్తి అవుతుంది. దాని నుంచి 20 టన్నుల పెల్లెట్స్‌ తయారుచేయవచ్చు..
పెల్లెట్స్‌ తయారీ ద్వారా ఏటా ఎకరాకు రూ.2 లక్షల నికర ఆదాయం లభిస్తుందని చెబుతున్న ఉద్యానశాఖ అధికారులు..
ఒకసారి పంట వేస్తే 50 ఏండ్ల వరకు పెరుగుతూనే ఉంటుంది.
ప్రత్యేకంగా నీళ్లు, ఎరువులు అవసరం లేదు.కాబట్టి పెద్దగా పెట్టుబడి ఉండదు..
వెదురు చెట్లు ఇతర చెట్ల కంటే 33 శాతం అధికంగా ఆక్సిజన్‌ను అందిస్తాయి..
వెదురును పొలం గట్లు, రోడ్ల వెంట పెంచవచ్చు..

ట్రెండింగ్ వార్తలు