Hyderabad Lands: వామ్మో.. ఎకరం భూమి ధర రూ.137 కోట్లు.. ఎక్కడో ఫారిన్ లో కాదు.. మన హైదరాబాద్ లోనే..
గతంలో ఎకరం 160 కోట్లకు అమ్ముడుపోయింది. ఇక 2023లో తొలిసారి కోకాపేటలో ఎకరం 100 కోట్లు పలికింది.
Hyderabad Lands: హైదరాబాద్ లో భూముల ధరలు చుక్కలను తాకుతున్నాయి. ఎకరం భూమి ధర వందల కోట్లు పలుకుతున్నాయి. భూముల ధరలు ఏ రేంజ్ లో పెరిగాయో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఏటేటా హైదరాబాద్ నగరంలో భూముల ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. తాజాగా రెండు ప్లాట్లను వేలం వేయగా.. రికార్డు ధర పలికాయి. ఎకరం భూమి ఏకంగా 137 కోట్లకు అమ్ముడుపోయింది. ఇది రెండో అత్యధికం. గతంలో ఎకరం 160 కోట్లకు అమ్ముడుపోయింది. ఇక 2023లో తొలిసారి కోకాపేటలో ఎకరం 100 కోట్లు పలికింది.
ఈరోజు రెండు ప్రధాన ప్లాట్లు వేలం వేశారు. కోకాపేట, నియోపోలిస్ లేఔట్లలో ఈ రెండు ఫ్లాట్లను వేలం వేశారు. ప్లాట్ నం. 17 విస్తీర్ణం 4.59 ఎకరాలు. ఎకరం రూ. 136.50 కోట్లు పలికింది. మొత్తం బిడ్ విలువ రూ. 626.53 కోట్లు. ప్లాట్ నం. 18 విస్తీర్ణం 5.31 ఎకరాలు. ఎకరం రూ.137.25 కోట్లు పలికింది. మొత్తం బిడ్ విలువ రూ.728.8 కోట్లు.
Also Read: కోడిగుడ్లు తినేవారికి బిగ్ అలర్ట్.. ఫౌల్ట్రీఫామ్‌లకు జరిగిన నష్టం కూడా అందుకు కారణమే..!
హైదరాబాద్ కోకాపేటలో ప్లాట్లు రికార్డ్ ధర పలికాయి. ఎకరం ధర అక్షరాల 137 కోట్ల 25 లక్షలు పలికింది. ప్లాట్ నెంబర్ 17లో 4.59 ఎకరాలు, ప్లాట్ నెంబర్ 18లో 5.31 ఎకరాలకు హెచ్ఎండీఏ వేలం నిర్వహించింది. ప్లాట్ నెంబర్ 17లో ఎకరం 136 కోట్ల 50 లక్షల ధర పలికింది. ఇక ప్లాట్ నెంబర్ 18లో ఎకరం ధర 137 కోట్ల 25 లక్షలు పలికింది. మొత్తంగా 9.90 ఎకరాలకు రూ.1355 కోట్ల 33 లక్షల ఆదాయం పొందింది హెచ్ఎండీఏ.
