Cm Revanth Reddy: పంచాయతీ ఎన్నికలపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు..
అభివృద్ధిని అడ్డుకునే వారిని సర్పంచ్ లుగా ఎన్నుకోవద్దని సీఎం రేవంత్ పిలుపునిచ్చారు.
Cm Revanth Reddy: కొడంగల్ లో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే పంచాయతీ ఎన్నికలు జరుగుతాయని అన్నారు. ఎన్నికలకు సంబంధించి రెండు మూడు రోజుల్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందన్నారు. అభివృద్ధిని అడ్డుకునే వారిని సర్పంచ్ లుగా ఎన్నుకోవద్దని సీఎం రేవంత్ పిలుపునిచ్చారు. అభివృద్ధి చేసే వారికే అండగా నిలవండి అని చెప్పారు. ఇందిరమ్మ రాజ్యాన్ని ప్రజలు ఆశీర్వదించాలని సీఎం రేవంత్ అన్నారు.
”ఈ కీలకమైన సందర్భంలో సర్పంచ్ ఎన్నికలు రాబోతున్నాయి. రాబోయే మూడు నాలుగు రోజుల్లోనే రాష్ట్ర ఎన్నికల సంఘం సర్పంచ్ ఎన్నికలు నిర్వహించబోతోందని నాకు సమాచారం ఉంది. ఈ వేదిక నుంచి నేను పిలుపిస్తున్నా. ప్రతి గ్రామంలో మంచోళ్లను సర్పంచ్ లుగా ఎన్నుకోండి. మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం.
అభివృద్ధిని అడ్డుకునే వాళ్లను సర్పంచ్ లను చేయకండి. అభివృద్ధిక సహకరించి, నా దగ్గరికి వచ్చి కూర్చుని, ఏం కావాలో అడిగి.. గ్రామ గ్రామంలో ఇంటింటికి సంక్షేమ పథకాలను అందించడమే కాకుండా.. ప్రతి గ్రామానికి రోడ్డు, బడి, గుడి ఉండాలి. తాగడానికి నీళ్ల ట్యాంకు ఉండాలి. ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు అందాలి. పేద అక్కకు, చెల్లెకు మనం పెడుతున్న సారె చీర ఆడబిడ్డలకు చేరాలి” అని సీఎం రేవంత్ అన్నారు.
Also Read: వామ్మో.. ఎకరం భూమి ధర రూ.137 కోట్లు.. ఎక్కడో ఫారిన్ లో కాదు.. మన హైదరాబాద్ లోనే..
