BC Reservations: తెలంగాణలో బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. వంగా గోపాల్ రెడ్డి రాష్ట్రంలో స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
హైకోర్టు స్టే ఇవ్వకపోవడంతో సుప్రీంకోర్టుకు వచ్చామని పిటిషనర్ చెప్పారు. దీంతో హైకోర్టు స్టే ఇవ్వకపోతే సుప్రీంకోర్టుకు వచ్చేస్తారా? అని సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. (BC Reservations)
హైకోర్టులో ఇదే అంశంపై రెండు పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నట్లు తెలంగాణ సర్కారు తరపు న్యాయవాదులు చెప్పారు. ఆర్టికల్ 32 కింద పిటిషన్ ఎందుకు ఫైల్ చేశారని పిటిషనర్‌ను ధర్మాసనం ప్రశ్నించింది.
హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నందున ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించబోమని జస్టిమ్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం తెలిపింది.
తెలంగాణలోని బీసీ రిజర్వేషన్ల అంశం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే స్థానిక సంస్థల ఎన్నికల్లో 50% మించి రిజర్వేషన్లు అమలు చేయబోతున్నారని వంగా గోపాల్ రెడ్డి పిటిషన్ వేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ రిజర్వేషన్లు అమలు చేస్తామని కాంగ్రెస్ అంటోంది.