Supreme Court : సుప్రీంకోర్టులో వనమాకు ఊరట.. తెలంగాణ హైకోర్టు తీర్పుపై స్టే

తన ఎన్నిక చెల్లదంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై మొదట్లోనే హైకోర్టులోనే వనమా పిటిషన్ వేశారు. అయితే తీర్పుపై స్టే ఇవ్వాలని కోరారు. కానీ, హైకోర్టులో స్టే ఇవ్వడానికి నిరాకరించడంతో వనమా సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.

Supreme Court Stayed

Supreme Court Stayed High Court Judgment : సుప్రీంకోర్టులో వనమా వెంకటేశ్వరరావుకు ఊరట లభించింది. కొత్తగూడెం ఎమ్మెల్యేగా వనమా వెంకటేశ్వరరావు ఎంపిక చెల్లదని తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. తెలంగాణ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో వనమా పిటిషన్ వేశారు. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ దీపంకర్ దత్తా ధర్మాసనం వనమా పిటిషన్ పై విచారణ జరిపింది.

తన ఎన్నిక చెల్లదంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై మొదట్లోనే హైకోర్టులోనే వనమా పిటిషన్ వేశారు. అయితే తీర్పుపై స్టే ఇవ్వాలని కోరారు. కానీ, హైకోర్టులో స్టే ఇవ్వడానికి నిరాకరించడంతో వనమా సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. 2018లో అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగూడెం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా వనమా వెంకటేశ్వరరావు పోటీ చేశారు.

Chiranjeevi : ఏపీ ప్రభుత్వంపై చిరంజీవి సంచలన వ్యాఖ్యలు.. రాష్ట్రాన్ని డెవలప్ చేయకుండా సినిమా ఇండస్ట్రీ మీద పడి ఏడుస్తారెందుకు?

బీఆర్ఎస్ అభ్యర్థి జలగం వెంకట్రావుపై 4 వేల ఓట్ల తేడాతో ఆయన గెలుపొందారు. అయితే ఎన్నికల అఫిడవిట్ వీటిలో వనమా తన ఆస్తులు, కేసుల వివరాలు పొందుపరచలేదని తప్పుడు ప్రచారం ఇచ్చారని జలగం వెంకట్రావు ఆరోపించారు. వనమాను అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు గత నెల (జులై)25న తీర్పు ఇచ్చింది.

దీనిపై మళ్లీ వనమా సుప్రీంకోర్టుకు వెళ్లారు. సుప్రీంకోర్టులో వనమా వెంకటేశ్వరరావుకు ఊరట లభించింది. కొత్తగూడెం ఎమ్మెల్యేగా వనమా ఎన్నిక చెల్లదని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. తుదుపరి విచారణను నాలుగు వారాలకు వేయిదా వేసింది.

ట్రెండింగ్ వార్తలు