Chiranjeevi : ఏపీ ప్రభుత్వంపై చిరంజీవి సంచలన వ్యాఖ్యలు.. రాష్ట్రాన్ని డెవలప్ చేయకుండా సినిమా ఇండస్ట్రీ మీద పడి ఏడుస్తారెందుకు?

తాజాగా వాల్తేరు వీరయ్య సినిమా 200 డేస్ సెలబ్రేషన్స్ జరిగాయి. ఈవెంట్ లో చిరంజీవి డైరెక్ట్ గా ఏపీ ప్రభుత్వం పై కామెంట్స్ చేశారు.

Chiranjeevi : ఏపీ ప్రభుత్వంపై చిరంజీవి సంచలన వ్యాఖ్యలు.. రాష్ట్రాన్ని డెవలప్ చేయకుండా సినిమా ఇండస్ట్రీ మీద పడి ఏడుస్తారెందుకు?

Chiranjeevi sensational comments on AP Government in Waltair Veerayya 200 days event

Chiranjeevi :  మెగాస్టార్ చిరంజీవి వింటేజ్ లుక్స్ అండ్ యాక్షన్ కామెడీతో మరోసారి తన స్టామినాని చూపించిన సినిమా ‘వాల్తేరు వీరయ్య’. డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో చిరంజీవి, రవితేజ కలిసి నటించగా ఈ సంవత్సరం సంక్రాంతికి రిలీజయి భారీ విజయం సాధించింది. వాల్తేరు వీరయ్యతో 200 కోట్లు సాధించి థియేటర్స్ లో భారీ విజయం సాధించి, అనంతరం ఓటీటీలో కూడా సందడి చేసింది. తాజాగా వాల్తేరు వీరయ్య సినిమా 200 డేస్ సెలబ్రేషన్స్ జరిగాయి. అయితే ఇది ఒక ప్రైవేట్ పార్టీలా మాత్రమే జరిగింది. వాల్తేరు వీరయ్య చిత్రయూనిట్, పలువురు సినీ ప్రముఖుల మధ్య మాత్రమే ఓ ప్రైవేట్ హోటల్ లో వాల్తేరు వీరయ్య 200 డేస్ సెలబ్రేషన్స్ జరిగాయి.

ఈ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవితో పాటు మాస్ మహారాజ రవితేజ కూడా వచ్చి మరోసారి మెగా మాస్ అభిమానులకి కిక్కిచ్చారు. అయితే ఈ ఈవెంట్ లో చిరంజీవి ఏపీ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల పవన్ కళ్యాణ్ పై వస్తున్న విమర్శలకు అప్పుడప్పుడు ఇండైరెక్ట్ గా కౌంటర్లు వేస్తూనే తమ్ముడికి సపోర్ట్ గా మాట్లాడుతున్నారు మెగాస్టార్. ఇక మెగా ఈవెంట్స్ లో అందరూ జనసేనకు సపోర్ట్ గా మాట్లాడుతూ ప్రభుత్వానికి ఇండైరెక్ట్ గా కౌంటర్లు వేస్తున్నారు. తాజాగా చిరంజీవి డైరెక్ట్ గా ఏపీ ప్రభుత్వం పై కామెంట్స్ చేశారు.

వాల్తేరు వీరయ్య 200 డేస్ ఈవెంట్ లో సినిమా సమస్యల గురించి, ఇటీవల అంబటి రాంబాబు బ్రో సినిమా గురించి మాట్లాడిన వ్యాఖ్యలకు కౌంటర్ గా మాట్లాడుతూ.. మీలాంటి వాళ్లు ప్రత్యేక హోదా గురించి గానీ, రోడ్ల నిర్మాణం గురించి గానీ, ప్రాజెక్టులు గురించి గానీ, పేదవారికి కడుపు నిండే విషయంగానీ, ఉద్యోగ , ఉపాధి అవకాశాలు కల్పించడం వాటి గురించి ఆలోచించాలి. మీలాంటి పెద్దవాళ్ళు ఇలాంటి విషయాల గురించి ఆలోచించి రాష్ట్రాన్ని డెవలప్ చేస్తే అందరూ మీకు తల వంచి నమస్కరిస్తారు. అంతేగాని పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా సినిమా ఇండస్ట్రీ మీద పడతారేంటి. ఇదేదో పెద్ద సమస్యలా చూపించకండి అని అన్నారు. దీంతో చిరంజీవి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

Ajith : అజిత్‌కి చాలా సర్జరీలు జరిగాయి.. పక్షవాతం వచ్చే అవకాశం ఉంది.. అయినా..

మెగాస్టార్ ఇంత డైరెక్ట్ గా మాట్లాడటంతో ఏపీ రాజకీయాల్లో ఈ వ్యాఖ్యలు చర్చగా మారాయి. వైసీపీ నాయకులు వాళ్లపై ఎలాంటి వ్యాఖ్యలు వచ్చినా, ముఖ్యంగా సినిమా వాళ్ళు ఏం మాట్లాడినా ప్రెస్ మీట్ పెట్టి మరీ విమర్శలు చేస్తారు. మరి ఇప్పుడు చిరంజీవి చేసిన వ్యాఖ్యలకు వైసీపీ నాయకులు ఎలా స్పందిస్తారో చూడాలి. ఇప్పటికే జనసేన మీద తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు చిరంజీవి వ్యాఖ్యలకు ఎలాంటి సమాధానం ఇస్తారో చూడాలి.