Suryapet: సూర్యాపేట జిల్లాలోని ఆ గ్రామంలో ఉద్రిక్తత.. ఎమ్మెల్యే రాకుండా ముళ్లకంప వేసిన గ్రామస్థులు

ఆందోళనకారులకు మద్దతుగా నిలిచారు సీపీఎం పార్టీ నాయకులు.

Telangana: తెలంగాణలోని సూర్యాపేట జిల్లా మోతే మండలం విబాలాపురం గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇవ్వాలని గ్రామస్థులు ఆందోళనకు దిగారు. డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీలో అవకతవకలు జరిగాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ (Bollam Mallaiah Yadav)పై గ్రామస్థులు మండిపడుతున్నారు.

తమకు ఇళ్లు రాకపోవడానికి అధికార పార్టీ నాయకులే కారణమని గ్రామస్థులు చెప్పారు. బొల్లం మల్లయ్య యాదవ్ చేతుల మీదుగా ఇండ్ల పట్టాల పంపిణీకి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇదే సమయంలో, అర్హులకు కాకుండా అనర్హులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ చేస్తున్నారని గ్రామస్థులు ఆందోళన చేస్తున్నారు. ఆందోళన కారులకు మద్దతుగా నిలిచారు సీపీఎం పార్టీ నాయకులు.

ఎమ్మెల్యే రాకుండా ముళ్ల కంపవేసి గ్రామస్థులు నిరసన తెలుపుతున్నారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో సీపీఎం పార్టీ నాయకులపై మోతే ఎస్ఐ మహేశ్ చేయి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో ఉద్రిక్తత మరింత పెరిగింది. ఎన్నికలు ఉన్నాయనే డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

Viral Video : యువకుడు కళ్లజోడు ఎత్తుకుపోయిన కోతి, మర్కటానికే మస్కా కొట్టించిన యువతి

ట్రెండింగ్ వార్తలు