Kavitha Bail Petition : మహిళ అయినా మినహాయింపు లేదు..! ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్

లిక్కర్ కేసు దర్యాప్తులో భాగంగా నిందితులు, సాక్షులు, అప్రూవర్లుగా మారిన వారు ఇచ్చిన వాంగ్మూలాలు, వాట్సప్ చాట్స్ ను కోర్టుకి వివరించింది ఈడీ.

Kavitha Bail Petition : ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీలాండరింగ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ విచారణ ముగిసింది. మే 6 కి తీర్పును రిజర్వ్ చేసింది రౌస్ అవెన్యూ కోర్టు. ఈడీ(ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) కేసులో కవిత బెయిల్ పిటిషన్ పై 3 రోజుల పాటు విచారణ సాగింది. కవితకు బెయిల్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తు 3 గంటల పాటు వాదనలు వినిపించింది ఈడీ. కవిత అరెస్ట్ చట్టబద్ధంగా జరిగిందని, నిబంధనలు ఉల్లంఘనకు గురికాలేదని, కవితకు వ్యతిరేకంగా తమ వద్ద ఆధారాలు ఉన్నాయని ఈడీ తెలిపింది.

మహిళ అయినా కవితకు బెయిల్ ఇచ్చే మినహాయింపు లేదంది. లిక్కర్ పాలసీ రూపకల్పన, అమలు, అక్రమాల్లో కవితను కీలక సూత్రధారిగా పేర్కొంది ఈడీ. లిక్కర్ కేసు దర్యాప్తులో భాగంగా నిందితులు, సాక్షులు, అప్రూవర్లుగా మారిన వారు ఇచ్చిన వాంగ్మూలాలు, వాట్సప్ చాట్స్ ను కోర్టుకి వివరించింది ఈడీ. కవితకు బెయిల్ ఇస్తే కేసు దర్యాప్తు ప్రభావితం అవుతుందని, సాక్షాలు ఆధారాలు తారుమారు చేస్తారని, గతంలో మొబైల్ ఫోన్లు ఫార్మాట్ చేశారని, సాక్షులను బెదిరించారని కోర్టుకు తెలిపింది ఈడీ. ఈడీ వాదనలపై రిజాయిన్డర్ ఎల్లుండి లిఖితపూర్వకంగా దాఖలు చేస్తామని కోర్టుకు తెలిపారు కవిత న్యాయవాదులు.

Also Read : అలా చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా: సీఎం రేవంత్ సవాల్ స్వీకరించిన హరీశ్ రావు

ట్రెండింగ్ వార్తలు