CPI – CPM : కాంగ్రెస్ తో వామపక్షాల పొత్తుపై కొనసాగుతున్న సందిగ్థత

కాంగ్రెస్ పొత్తు ధర్మం పాటించడం లేదన్న భావనలో కమ్యూనిస్టులున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ తో పొత్తుపై ఈ రెండు పార్టీలు తుది నిర్ణయం తీసుకోనున్నాయి.

CPI - CPM

TCongress alliance CPI and CPM : కాంగ్రెస్ తో వామపక్షాల పొత్తుపై సందిగ్థత కొనసాగుతోంది. సీపీఐ, సీపీఎం రాష్ట్రదర్శివర్గాలు వేర్వేరుగా సమావేశం అయ్యాయి. కాంగ్రెస్ తో పొత్తు, సీట్ల సర్దుబాటు సీపీఎం ఇప్పటికే డెడ్ లైన్ విధించింది. ఒంటరిగా బరిలో ఉండాలని సీపీఎం నిర్ణయించింది. ఐదు నుంచి ఎనిమిది స్థానాల్లో బరిలో దిగాలని యోచిస్తోంది. మరోవైపు కొత్తగూడెం స్థానం సీపీఐకి కేటాయింపుపై కాంగ్రెస్ లో సుముఖత కనిపిస్తోంది.

కాంగ్రెస్ పొత్తు ధర్మం పాటించడం లేదన్న భావనలో కమ్యూనిస్టులున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ తో పొత్తుపై ఈ రెండు పార్టీలు తుది నిర్ణయం తీసుకోనున్నాయి. కాగా, కాంగ్రెస్ ముందు నుంచి సీపీఐకి రెండు, సీపీఎంకు రెండు స్థానాలను కేటాయిస్తామని చెబుతూవస్తోంది. సీపీఐకి కొత్తగూడెం, చెన్నూరు, సీపీఎంకు మిర్యాలగూడ, వైరా ఇస్తామని చెప్పింది. కానీ, వామపక్షాలకు ఇచ్చే స్థానాలపై కాంగ్రెస్ లో స్పష్టత కొరవడింది.

Vivek Venkataswamy : నాకు టిక్కెట్ ముఖ్యం కాదు.. కేసీఆర్ సర్కారుపై పోరాడటమే ముఖ్యం : వివేక్

సీపీఐకి కొత్తగూడెం కేటాయిస్తామని చెబుతున్నా చెన్నూరు స్థానంపై క్లారిటీ రాలేదు. అలాగే సీపీఎంకు మిర్యాలగూడ, వైరా ఇస్తామని చెప్పినా ఆ దిశగా అడుగులు పడటం లేదు. దీంతో కాంగ్రెస్, వామపక్షాల పొత్తుపై నీలి మేఘాలు కమ్ముకున్నాయి. సీట్ల కేటాయింపుపై కాంగ్రెస్ అలసత్వం ప్రదర్శిస్తుండటంతో సీపీఐ, సీపీఎం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీపీఎం ఒంటరిగానే ఎన్నికల బరిలో దిగాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

ట్రెండింగ్ వార్తలు