V.hanumantha rao
V.hanumantha rao ..Telangana BJP : బీసీ వ్యక్తి సీఎం చేస్తామని బీజేపీ అనటం చాలా గొప్ప విషయం అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు. ముస్లిం రిజర్వేషన్ తీసేస్తాం అంటున్నారు.. ఇదేం లెక్క..? అంటూ ప్రశ్నించారు. బీసీ మంత్రిత్వ శాఖపెట్టాలని ప్రధాని మోదీని కోరాం..కానీ చేయలేదు.బీసీ క్రిమిలేయర్ ఎత్తివేయాలని కోరాం..అదీ చేయలేదు..బీసీ వర్గానికి చెందిన బండి సంజయ్ అధ్యక్ష పదవిలోంచి తీసేసి కిషన్ రెడ్డిని నియమించారు..ఎన్నికల్లో ఓట్ల కోసమే ఇప్పుడు బీసీ సీఎం డ్రామా ఆడుతున్నారు అంటూ విమర్శించారు.బీసీ రిజర్వేషన్ పెంచాలని డిమాండ్ చేశారు.బీసీ వ్యక్తిని సీఎం చేస్తామని బీజేపీ చెప్పేదంతా మోసమన్నారు. ముస్లిం నోట్లో మట్టి కొట్టాలని బీజేపీ చూస్తోంది అంటూ విమర్శించారు.
రాహుల్ ప్రధాని ఐతే బీసీ కులగణన చేపడతామన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ వేవ్ నడుస్తోందన్నారు.ఈ సందర్భంగా మైనార్టీలు కూడా ఆలోచన చేయాలని సూచించారు.ఓబీసీ కులగణన చేసి.. కేసీఆర్ బయట పెట్టలేదు కానీ నితీష్ కుమార్ చేశారని అన్నారు. ఓబీసీ కులగణన తమిళనాడు, ఒరిస్సాలో కూడా చేస్తున్నారని అన్నారు. బీజేపీ రిమోట్ కంట్రోల్ నాగపూర్ లో మోహన్ భగవత్ వద్ద వుందని విమర్శించారు. బీజేపీలను మోసం చేయడానికి బీసీ సీఎం అంటున్నారని అవన్నీ నమ్మవద్దన్నారు. అంబర్ పేట టికెట్ ఆశించిన నూతి శ్రీకాంత్ కు టికెట్ ఇవ్వ వద్దని నేనే చెప్పానని తెలిపారు. నన్ను తిట్టినోడికి, కొట్టినోడికి..నేను టికెట్ ఇప్పించాలా..? అని ప్రశ్నించారు.రోహిన్ రెడ్డిని గెలిపించడానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా వీహెచ్ తెలిపారు.