Rafale Fighter Jets: ఆపరేషన్ సిందూర్ తర్వాత రక్షణ రంగ ఒప్పందాలు మరింత పదును తేలుతున్నాయి. పాకిస్తాన్ పుచ్చ లేపిన రాఫెల్ ఫైటర్ జెట్లను మన హైదరాబాద్ లోనే తయారు చేసేందుకు టాటా గ్రూప్ ఒప్పందం చేసుకుంది. ఫ్రాన్స్ కంపెనీ డసాల్ట్ ఏవియేషన్ తో రాఫెల్ ఫైటర్ జెట్ స్పేర్ పార్ట్స్ తయారు చేసేందుకు టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ డీల్ కుదుర్చుకుంది. ఈ మేరకు రెండు సంస్థలు డీల్ పై ప్రకటన చేశాయి. హైదరాబాద్ లోని టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ఓ కటింగ్ ఎడ్జ్ ప్రొడక్షన్ ఫెసిలిటీ నెలకొల్పనుంది.
ఇందులోనే రాఫెల్ జెట్ ఫైటర్లకు అత్యంత కీలకమైన స్ట్రక్చరల్ పార్ట్స్ తయారు చేయబోతున్నారు. పాకిస్తాన్ పై రీసెంట్ గా జరిగిన ఆపరేషన్ సిందూర్ లో రాఫెల్ ఫైటర్ జెట్ల ద్వారా కూడా డ్రోన్ల అటాక్ జరిగింది. ఏ మాత్రం తేడా రాని విధంగా అత్యంత కచ్చితమైన స్ట్రైక్స్ చేసినటువంటి ఘనత రాఫెల్ ఫైటర్లకు దక్కగా.. అలాంటి ఫైటర్లను హైదరాబాద్ లోనే తయారు చేయాలని టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ డిసైడ్ కావడం కూడా ఇక్కడ విశేషం. రఫెల్ కి సంబంధించిన సెంట్రల్ ఫ్యూజలేజ్ అలాగే కంప్లీట్ రేర్ సెక్షన్, రేర్ ఫ్యూజలేజ్ సహా ఫ్రంట్ సెక్షన్ అంతా కూడా హైదరాబాద్ లోనే తయారు చేయబోతున్నట్లుగా టాటా గ్రూప్ ప్రకటించింది.
ఫ్రాన్స్ కంపెనీ డసాల్ట్ ఏవియేషన్ ఏ ఇతర దేశాల్లో ఎలాంటి పార్టులు తయారు చేసినా రాఫెల్ ఫ్యూజలేజ్ తయారీ మాత్రం ఫ్రాన్స్ లోనే తయారు అయ్యేది. కానీ, మొట్టమొదటి సారిగా భారత్ లోనే అందులోనూ హైదరాబాద్ లో ఈ రాఫెల్ ఫ్యూజలేజ్ తయారు కానుండటం విశేషంగా చెప్పాలి. మేకిన్ ఇండియా కాన్సెప్ట్ తో రాఫెల్ కూడా తయారు కానుంది. అదే సమయంలో హైదరాబాద్ లో డిఫెన్స్ పరికరాలు, ఆయుధాల తయారీకి అడుగులు వేగంగా పడుతున్నాయి.
రాఫెల్ తయారీదారు డస్సాల్ట్ ఏవియేషన్.. భారత్, ఇతర ప్రపంచ మార్కెట్ల కోసం యుద్ధ విమానాలలో కొన్ని భాగాలను తయారు చేయడానికి టాటా గ్రూప్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యంలో భాగంగా హైదరాబాద్‌లో తయారీ కేంద్రం ఏర్పాటు కానుంది.
“డస్సాల్ట్ ఏవియేషన్, టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ భారత్ లో రాఫెల్ యుద్ధ విమానాల ఫ్యూజ్‌లేజ్‌ను తయారు చేయడానికి నాలుగు ఉత్పత్తి ఒప్పందాలపై సంతకం చేశాయి. ఇది దేశ ఏరోస్పేస్ తయారీ సామర్థ్యాలను బలోపేతం చేయడంలో, ప్రపంచ సరఫరా చైన్ కు మద్దతివ్వడంలో ఒక ముఖ్యమైన ముందడుగు. ఈ ఒప్పందం భారతదేశ ఏరోస్పేస్ మౌలిక సదుపాయాలలో గణనీయమైన పెట్టుబడిని సూచిస్తుంది. అధిక కచ్చితత్వ తయారీకి కీలకమైన కేంద్రంగా ఉపయోగపడుతుంది.
Also Read: ట్రంప్ మరో సంచలన నిర్ణయం.. అఫ్గానిస్థాన్, ఇరాన్ సహా 12 దేశాల పౌరులకు అమెరికాలోకి నో ఎంట్రీ..
టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ హైదరాబాద్‌లో రాఫెల్ కీలకమైన నిర్మాణ విభాగాల తయారీకి అత్యాధునిక ఉత్పత్తి సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తుంది. వీటిలో ఫ్యూజ్‌లేజ్ షెల్స్, వెనుక విభాగం, సెంట్రల్ ఫ్యూజ్‌లేజ్, ముందు భాగం ఉన్నాయి. మొదటి ఫ్యూజ్‌లేజ్ విభాగాలు 2028 నాటికి ప్లాంట్ నుంచి బయటకు వస్తాయని భావిస్తున్నారు. నెలకు రెండు పూర్తి ఫ్యూజ్‌లేజ్‌లను సరఫరా చేస్తుందని భావిస్తున్నారు.
“రాఫెల్ ఫ్యూజ్‌లేజ్‌ను ఫ్రాన్స్ వెలుపల తయారు చేయడం ఇదే మొదటిసారి. భారత్ లో మా సప్లయ్ చైన్ ను గొలుసును బలోపేతం చేయడంలో ఇది నిర్ణయాత్మక అడుగు. భారత ఏరోస్పేస్ పరిశ్రమలో ప్రధానమైన TASLతో సహా మా స్థానిక భాగస్వాముల విస్తరణకు ధన్యవాదాలు. ఈ సప్లయ్ చైన్ రాఫెల్ విజయవంతమైన విస్తరణకు దోహదం చేస్తుంది. నాణ్యత, పోటీతత్వ అవసరాలను తీరుస్తుంది” అని డస్సాల్ట్ ఏవియేషన్ చైర్మన్ CEO ఎరిక్ ట్రాపియర్ అన్నారు.
ఈ కీలక ఒప్పందంపై టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మేనేజింగ్ డైరెక్టర్ సుకరణ్ సింగ్ స్పందించారు. ఈ భాగస్వామ్యం భారతదేశ అంతరిక్ష ప్రయాణంలో ఒక ముఖ్యమైన అడుగు అని అన్నారు. “భారత్ లో పూర్తి రాఫెల్ ఫ్యూజ్‌లేజ్ ఉత్పత్తి టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ సామర్థ్యాలపై పెరుగుతున్న నమ్మకాన్ని, డస్సాల్ట్ ఏవియేషన్‌తో మా సహకారం బలాన్ని నొక్కి చెబుతుంది. ప్రపంచ వేదికలకు మద్దతివ్వగల మోడెమ్, బలమైన అంతరిక్ష తయారీ పర్యావరణ వ్యవస్థను స్థాపించడంలో భారత్ సాధించిన అద్భుతమైన పురోగతిని కూడా ఇది ప్రతిబింబిస్తుంది” అని ఆయన అన్నారు.