తీన్మార్ మల్లన్న విజయం..! పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో కాంగ్రెస్ గెలుపు..!

సాంకేతికంగా ఓడిపోయినా, నైతికంగా గెలిచాను అని రాకేశ్ రెడ్డి అన్నారు. ప్రతీ రౌండ్ లో గట్టి పోటీ ఇచ్చానని చెప్పారు.

Graduate Mlc By Poll Result 2024 : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయం సాధించింది. కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గెలుపొందాడు. బీఆర్ఎస్ అభ్యర్థి ఎలిమినేషన్ తో మల్లన్న విజయం సాధించాడు. రెండో ప్రాధాన్యత ఓట్లలో మల్లన్న, రాకేశ్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అయితే, రాకేశ్ ఎలిమినేషన్ తో మల్లన్నను విజయం వరించింది. అర్థరాత్రి వరకు తుది ఫలితం ప్రకటించే అవకాశం ఉంది.

గెలుపు కోటా కోసం బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి ని అధికారులు ఎలిమినేట్ చేశారు. పూర్తి లెక్కింపు అయ్యాకనే అధికారికంగా తీన్మార్ మల్లన్న విజయాన్ని అధికారులు ప్రకటించనున్నారు. అర్ధరాత్రి వరకు తుది ఫలితం ప్రకటించే అవకాశం ఉంది.

కౌంటింగ్ కేంద్రం వద్ద బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి మాట్లాడారు. సాంకేతికంగా ఓడిపోయాను, కానీ నైతికంగా గెలిచాను అని రాకేశ్ రెడ్డి అన్నారు. నేను ప్రతీ రౌండ్ లో గట్టి పోటీ ఇచ్చానని చెప్పారు. కోటా ఓటు చేరుకోకుండా పోటీ ఇచ్చానని వెల్లడించారు. శాసనమండలిలో అడుగుపెట్టలేకున్నా బయట నుండి పట్టభధ్రుల కోసం పోరాడతానని రాకేశ్ రెడ్డి చెప్పారు.

Also Read : తెలంగాణ నుంచి కేంద్రమంత్రులు అయ్యేదెవరు.? ఆ 8మందిలో అవకాశం దక్కేది ఎవరికి?

ట్రెండింగ్ వార్తలు