Strange Object Landed in Vikarabad : ఆకాశం నుంచి వికారాబాద్ పంటపొలాల్లో పడిన వింత వస్తువు .. భయాందోళనలో గ్రామస్తులు

ఆకాశం నుంచి వికారాబాద్ పంటపొలాల్లో పడింది ఓ వింత వస్తువు. దానిని చూసిన స్థానికులు భయాందోళనలు వ్యక్తంచేస్తున్నారు

Strange Object Landed in Vikarabad : వికారాబాద్ జిల్లాలోని మర్పల్లి మండలం మొగిలిగుండ్లలోని పంటపొలాల్లో పడిన ఓ వింత వస్తువు స్థానికులను భయాందోళనలకు గురిచేసింది. ఆకాశం నుంచి ఒక వింత ఆకారం నేలను తాకింది. మొగిలిగుండ్ల అటవీప్రాంతంలో పడింది. అక్కడే ఉన్న స్థానికులు దానిని చూసి ఒక్కసారిగా విస్తుబోయారు. ఆశ్చర్యపడ్డారు. భయాందోళనలకు వ్యక్తంచేశారు. చూడబోతే అది.. ఆదిత్య 369 సినిమాలో ఉండే టైం మిషన్ లా అనిపిస్తోంది. అది రీసెర్చ్ బెలూన్ అని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. సినిమాల్లోలాగా ఆకాశంలోంచి ఎగురుకుంటూ వచ్చి పొలాల్లో పడింది అనిస్థానికులు చెబుతున్నారు.

బెలూన్ వంటి పెద్ద ఫాలిథిన్ కవర్ ద్వారా కిందకు సేఫ్‌గా ల్యాండ్ అయ్యింది ఈ వింత వస్తువు. గుండ్రంగా ఉన్న భారీ వస్తువు పంటపొలాల్లో ప్రత్యక్షమవ్వడంతో స్థానికంగా అందరూ ఆశ్చర్యానికి, భయాందోళనకు గురయ్యారు. దానిలోపల కెమరాలు ఉన్నట్టు గుర్తించారు. అలాగే లోపల కూర్చోవడానికి సీటు కూడా ఉందని చెబుతున్నారు స్థానికులు. ఈ విషయాన్ని వెంటనే పోలీసులకు రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు.

సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు అ వస్తువు ఏంటో తెలుసుకునే పనిలో పడగా శాస్త్రవేత్తలు మాత్రం అది రీసెర్చ్ బెలూన్ అని చెబుతున్నారు. కాగా నాలుగేళ్ళ క్రితం కూడా ఇలాంటి వస్తువే ఒకటి వికారాబాద్ జిల్లా దోమ మండల అటవీ ప్రాంతంలో పడింది. వాతావరణ శాఖకు సంబంధించిన సామాగ్రి అని అప్పట్లో అధికారులు తెలిపారు. ఈక్రమంలో మరోసారి ఆకాశం నుంచి వింత వస్తువు పడటంతో స్థానికులు భయాందోళనలకు గురి అయ్యారు. ఈక్రమంలో ఆ తర్వాత మళ్ళీ అలాంటి వస్తువే వికారాబాద్ జిల్లా మర్పల్లి మండల పంటపొలాల్లో ఆకాశం నుంచి పడడం స్థానికంగా కలకలం రేపుతోంది.


								

ట్రెండింగ్ వార్తలు