IMD Alert: ఏపీ, తెలంగాణలో మారుతున్న వాతావరణం.. ఈ జిల్లాలకు వర్ష సూచన

నైరుతి రుతుపవనాలు, ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రానున్న రెండు రోజుల పాటు వాతావరణం(IMD Alert) మారనుంది.

Telangana and andhra pradesh weather update two days rain alert issued by imd

  • తెలుగు రాష్ట్రాలకు వెదర్ అలర్ట్
  • ఉరుములు పిడుగులతో ఈదురుగాలుల వర్షం
  • పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు

IMD Alert: నైరుతి రుతుపవనాలు, ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రానున్న రెండు రోజుల పాటు వాతావరణం మారనుంది. భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించిన సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు(IMD Alert), కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ముఖ్యంగా సాయంత్రం లేదా రాత్రి సమయాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తుఫాను వాతావరణం నెలకొనే అవకాశం ఉన్నందున ప్రయాణికులు, సముద్ర తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

Indiramma Indlu: ‘ఇందిరమ్మ ఇండ్ల’ రెండో విడత కేటాయింపుపై కీల‌క ప్ర‌క‌ట‌న‌.. తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్

తెలంగాణ వాతావరణం, ఎల్లో అలర్ట్:

తెలంగాణలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం వంటి 13 జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు (గంటకు 30-40 కిమీ వేగంతో) వీచే అవకాశం ఉనందున IMD ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో ఆకాశం పాక్షికంగా మబ్బుపట్టి ఉండి, సాయంత్రం వేళల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశముంది.

ఆంధ్రప్రదేశ్ వాతావరణ పరిస్థితులు:

ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజుతో పాటు కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడ ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీరం వెంట ఈదురుగాలులు బలంగా వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లే సమయంలో జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు. పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున వర్షం పడే సమయంలో చెట్లు, విద్యుత్ స్తంభాల కింద నిలబడవద్దని ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు.