Telangana Assembly : అసెంబ్లీలో ఎమ్మెల్యేలతో గ్రూప్ ఫోటో దిగనున్న సీఎం కేసీఆర్

అసెంబ్లీ సమావేశాలకు సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు. బీఆర్ఎస్ కు ఇవే చివరి అసెంబ్లీ సమావేశాలు కావటంతో సీఎం కేసీఆర్ రేపు అసెంబ్లీ హాజరు అయి కీలక ప్రసంగం చేయనున్నారు.

CM KCR

Telangana Assembly CM KCR : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు గురువారం ప్రారంభమై కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో త్వరలో న్నికలు జరుగుతున్న క్రమంలో అసెంబ్లీ లాబీలో ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. సభలు, సమావేశాల్లో ఒకరిపై ఒకరు మాటల దాడిచేసుకొనే నేతలు అసెంబ్లీ లాబీలో సరదాగా ముచ్చట్లు పెట్టుకున్నారు. కానీ బీజేపీ, వర్సెస్ బీఆర్ఎస్ అనే వాతావరణం మాత్రం మారటంలేదు.

ఇదిలా ఉంటే రేపు కూడా అసెంబ్లీ సమావేశాలు జరుగునున్నాయి. ఈక్రమంలో రేపు అసెంబ్లీ సమావేశాలకు సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు. బీఆర్ఎస్ కు ఇవే చివరి అసెంబ్లీ సమావేశాలు కావటంతో సీఎం కేసీఆర్ రేపు అసెంబ్లీ హాజరు అయి కీలక ప్రసంగం చేయనున్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై సభలో చర్చ జరగపనున్నారు. కాగా బీఆర్ఎస్ కు ఇవే చివరి అసెంబ్లీ సమావేశాలు కావటంతో రేపు సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేలు అందరికి కలిసి గ్రూప్ ఫోటో దిగనున్నారు.

Governor Tamilisai : ప్రభుత్వం వివరణతో కూడిన సమాధానం ఇస్తేనే టీఎస్ఆర్టీసీ బిల్లుకు ఆమోదం : గవర్నర్ తమిళిసై

ఈ సమావేశాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వంలో టీఎస్ఆర్టీసీ విలీనం బిల్లు పెండింగ్ పై రాజ్ భవన్(Raj Bhavan) క్లారిటీ ఇచ్చింది. ఈ బిల్లుపై కొన్ని సందేహాలను వ్యక్తం చేసిన గవర్నర్ వాటిని నివృత్తి చేయాలని సీఎస్ శాంతికుమారికి(CS Shanthi Kumari) లేఖ రాశారు. ఈ బిల్లును ఇప్పటికే అసెంబ్లీలో(Assembly) ప్రవేశ పెట్టాలని ప్రభుత్వం భావించగా గవర్నర్ అనుమతి లభించకపోవడంతో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. గవర్నర్ కాలయాపన చేస్తున్నారన్న విమర్శిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు.

దీనిపై గవర్నర్ భవన్ ఓ ప్రకటన విడుదల చేస్తు..ప్రభుత్వ నుంచి వివరణతో కూడిన సమాధానం వస్తే బిల్లుపై గవర్నర్ త్వరగా నిర్ణయం తీసుకుంటారని తెలిపింది. అయితే అసెంబ్లీ సమావేశాల్లో ఆగస్టు3వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఆగస్టు2వ తేదీ మధ్యాహ్నం 3.30 గంటలకు రాజ్ భవన్ కు బిల్లు చేరిందని, ఆ బిల్లును పరిశీలించి నిర్ణయం తీసుకునేందుకు మరి కొంత సమయం పడుతుందని తెలిపింది.