TS Congress Candidates First List : కాంగ్రెస్ పార్టీ తొలి జాబితా విడుదల.. 55 నియోజకవర్గాలకు అభ్యర్థుల పేర్లు ప్రకటన

రాష్ట్రంలో మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. తొలి విడతలో 55 నియోజకవర్గాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది.

Telangana Congress party

Telangana Assembly Elections 2023: తెలంగాణలో నవంబర్ 30న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తొలి విడుత అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. రాష్ట్రంలో మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. తొలి విడతలో 55 నియోజకవర్గాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. ఈ జాబితాను ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఆదివారం ఉదయం విడుదల చేశారు. అయితే తొలి జాబితాలో 12 మంది ఎస్సీ స్థానాలకు, రెండు ఎస్టీ స్థానాలకు అభ్యర్థులను కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. మిగిలిన  నియోజకవర్గాల జాబితాను ఈనెల 25లోపు ప్రకటించేందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కసరత్తు చేస్తోంది.

Read Also : T Congress : టికెట్ల కోసం ఢిల్లీ బాట పట్టిన కమ్మ ఆశావహులు

కాంగ్రెస్  పార్టీ ప్రకటించిన  మొదటి జాబితాలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరుకు టికెట్లు దక్కాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి (హుజూర్ నగర్),  ఆయన సతీమణి పద్మావతి ఉత్తమ్ (కోదాడ) నియోజకవర్గం టికెట్లు దక్కాయి. అదేవిధంగా మైనంపల్లి హన్మంతరావు (మల్కాజిగిరి),  మైనంపల్లి రోహిత్ రావు (మెదక్) టికెట్లు దక్కాయి. ఇదిలాఉంటే.. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆరు స్థానాలకు అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.  హుజూర్ నగర్ – ఉత్తమ్ కుమార్ రెడ్డి,  కోదాడ – పద్మావతి ఉత్తమ్, నల్గొండ – కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, నాగార్జున సాగర్ – కుందూరు జయవీర్ రెడ్డి,  నకిరేకల్ – వేముల వీరేశం, ఆలేరు – బీర్ల ఐలయ్య పేర్లను తొలి జాబితాలో ప్రకటించింది. అదేవిధంగా ఖమ్మం ఉమ్మడి జిల్లాలో తొలి విడతలో రెండు నియోజకవర్గాలకే అభ్యర్థులను కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. ఇందులో మధిర (ఎస్సీ) నియోజకవర్గం నుంచి భట్టి విక్రమార్క, భద్రాచలం (ఎస్టీ) నియోజకవర్గం పొదెం వీరయ్య పేర్లను కాంగ్రెస్ ప్రకటించింది.

Read Also : Revanth Reddy: చనిపోయిన ఆడపిల్లపై అభాండాలు వేస్తున్నారు: రేవంత్ రెడ్డి

55 మంది కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా ఇదే..
బెల్లంపల్లి (ఎస్సీ) – గడ్డం వినోద్
మంచిర్యాల – కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు
నిర్మల్ – శ్రీహరి రావు
ఆర్మూర్ – ప్రొద్దటూరి వినయ్ కుమార్ రెడ్డి
బోధన్ – పి. సుదర్శన్ రెడ్డి
బాల్కొండ – సునీల్ కుమార్ ముత్యాల
జగిత్యాల – టి. జీవన్ రెడ్డి
ధర్మపురి (ఎస్సీ) – అడ్లూరి లక్ష్మణ్ కుమార్
రామగుండం – ఎం.ఎస్. రాజ్ థరూర్
మంథని – దుద్దిళ్ల శ్రీధర్ బాబు
పెద్దపల్లి – చింతకుంట విజయ్ రమణారావు
వేములవాడ – ఆది శ్రీనివాస్
మానుకొండూర్ (ఎస్సీ) – కవ్వంపల్లి సత్యనారాయణ
మెదక్ – మైనంపల్లి రోహిత్ రావు.
అందోల్ (ఎస్సీ) – దామోదర్ రాజనర్సింహ
జహీరాబాద్ (ఎస్సీ) – ఆగం చంద్రశేఖర్.
సంగారెడ్డి – జగ్గారెడ్డి
గజ్వేల్ – తూముకుంట నర్సారెడ్డి
మేడ్చల్ – తోటకూర వజ్రేశ్ యాదవ్
మల్కాజిగిరి – మైనంపల్లి హన్మంతరావు
కుత్బుల్లాపూర్ – కొలన్ హన్మంత్ రెడ్డి
ఉప్పల్ – ఎం. పరమేశ్వర్ రెడ్డి
చేవెళ్ల (ఎస్సీ) – భీమ్ భరత్
పరిగి – టి. రామ్మోహన్ రెడ్డి
వికారాబాద్ (ఎస్సీ) – గడ్డం ప్రసాద్ కుమార్
ముషీరాబాద్ – అంజన్ కుమార్ యాదవ్
మలక్ పేట – షేక్ అక్బర్
సనత్ నగర్ – కోట నీలిమ
నాంపల్లి – ఫిరోజ్ ఖాన్
కార్వాన్ – ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రి
గోషామహల్ – మొగిలి సునీత
చాంద్రయణగుట్ట – బోయ నగేశ్ (నరేశ్)
యాకత్ పుర – కె. రవిరాజు
బహదూర్ పుర – రాజేశ్ కుమార్ పులిపాటి
సికింద్రాబాద్ – ఎ. సంతోష్ కుమార్
కొడంగల్ – అనుముల రేవంత్ రెడ్డి
గద్వాల – సరితా తిరుపతయ్య
అలంపూర్ (ఎస్సీ) – సంపత్ కుమార్
నాగర్ కర్నూల్ – కూచకుళ్ల రాజేశ్ రెడ్డి
అచ్చంపేట్ (ఎస్సీ) – చిక్కుడు వంశీకృష్ణ
కల్వకుర్తి – కసిరెడ్డి నారాయణ్ రెడ్డి
షాద్ నగర్ – కె. శంకరయ్య
కొల్లాపూర్ – జూపల్లి కృష్ణారావు
నాగార్జున సాగర్ – కుందూరు జయవీర్
హుజూర్ నగర్ – ఉత్తమ్ కుమార్ రెడ్డి
కోదాడ – పద్మావతి రెడ్డి
నల్గొండ – కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
నకిరేకల్ (ఎస్సీ) – వేముల వీరేశం
ఆలేరు – బీర్ల ఐలయ్య
స్టేషన్ ఘన్ పూర్ (ఎస్సీ) – సింగాపురం ఇందిర
నర్సంపేట – దొంతి మాధవ్ రెడ్డి
భూపాలపల్లి – గండ్ర సత్యనారాయణ రావు
ములుగు (ఎస్టీ ) – ధనసరి సీతక్క
మధిర (ఎస్సీ) – మల్లు భట్టి విక్రమార్క
భద్రాచలం (ఎస్టీ) – పొదెం వీరయ్య

 

 

 

ట్రెండింగ్ వార్తలు