×
Ad

BJP Candidates First List : తెలంగాణలో ఎన్నికల కోలాహలం.. బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా సిద్ధం, 10టీవీ ఎక్స్‌క్లూజివ్ రిపోర్ట్

బీజేపీ విషయానికి వస్తే 39 నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్లు సమాచారం. BJP Candidates First List

  • Published On : August 12, 2023 / 10:02 PM IST

BJP Candidates First List

BJP MLA Candidates : తెలంగాణలో ఎన్నికల కోలాహలం మొదలైంది. అసెంబ్లీ ఎన్నికలకు మరో మూడు నెలల సమయం మాత్రమే ఉండటంతో పార్టీలన్నీ అభ్యర్థుల జాబితా దిశగా కసరత్తు చేస్తున్నాయి. ఈ విషయంలో అధికార బీఆర్ఎస్ అందరికన్నా ముందుంది. ఈ నెల 16న అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసేందుకు సిద్ధమైనట్లుగా సమాచారం అందుతోంది.

అలాగే అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ పార్టీల్లో కూడా తొలి జాబితా సిద్ధమైంది. దీనికి సంబంధించిన వివరాలను 10టీవీ ఎక్స్ క్లూజివ్ గా సంపాదించింది. బీఆర్ఎస్ తొలి జాబితాలో 78మంది పేర్లు ఉంటాయని ప్రచారం జరుగుతోంది.

ఇక బీజేపీ విషయానికి వస్తే 39 నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్లు సమాచారం. బీజేపీ ఫస్ట్ లిస్ట్ లో ఫైనల్ అయిన అభ్యర్థుల జాబితా 10టీవీ చేతిలో ఉంది. ఆ జాబితాలో ఉన్న లీడర్లు ఎవరు? ఏ జిల్లాలో ఎవరెవరికి పోటీ చేసే అవకాశం దక్కింది? బీజేపీ నుంచి బరిలో నిలవబోతున్న అభ్యర్థుల పేర్లను 10టీవీ ఎక్స్ క్లూజివ్ గా అందించింది.

Also Read..BRS Candidates First List : తెలంగాణలో ఎన్నికల కోలాహలం.. 78మందితో బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితా సిద్ధం, 10టీవీ ఎక్స్‌క్లూజివ్ రిపోర్ట్

బీజేపీ మొదటి జాబితాలో అభ్యర్థులుగా ఉండే వారు..

ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన చూస్తే..

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా (5/10)

1.సిర్పూర్ కాగజ్‌నగర్‌ – పాల్వాయి హరీష్ బాబు
2.బోథ్ – సోయం బాపూరావు
3.నిర్మల్ – మహేశ్వరరెడ్డి
4.ముథోల్ – రామారావు పటేల్
5.ఖానాపూర్‌ – రమేష్ రాథోడ్

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా (3/9)

6.బాన్సువాడ – యాలాద్రి
7.ఆర్మూర్ – ధర్మపురి అర్వింద్
8.నిజామాబాద్ అర్బన్ – యండల లక్ష్మీనారాయణ

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా ( 7/13)

10.ధర్మపురి – వివేక్
11.చొప్పదండి – బోడిగ శోభ
12.రామగుండం – సోమారపు‌ సత్యనారాయణ
13.మంథని – సునీల్ రెడ్డి
14.కరీంనగర్ – బండి‌ సంజయ్
15.హుజూరాబాద్ – ఈటల రాజేందర్
16.వేములవాడ – తుల ఉమ / చెన్నమనేని వికాస్‌

ఉమ్మడి మెదక్‌ జిల్లా (4/10)

17.జహీరాబాద్ – దేశ్ పాండే
18.పటాన్‌చెరు – గడీల శ్రీకాంత్ గౌడ్
19.ఆందోల్ – బాబూమోహన్
20.దుబ్బాక – రఘునందనరావు

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా (6/14)

21.ఇబ్రహీంపట్నం – బూర నర్సయ్య గౌడ్
22.మహేశ్వరం – అందెల శ్రీరాములు యాదవ్
23.రాజేంద్రనగర్ – కొండా విశ్వేశ్వర్‌రెడ్డి
24.కుత్బుల్లాపూర్ – శ్రీశైలం గౌడ్
25.మల్కాజ్‌గిరి – రామచంద్రరావు
26.ఉప్పల్ – ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్

ఉమ్మడి హైదరాబాద్‌ జిల్లా ( 5/15)

27.సికింద్రాబాద్ – మేకల సారంగపాణి
28.సనత్ నగర్ – మర్రి శశిధర్ రెడ్డి
29 గోషామహాల్ – ఎం. విక్రమ్ గౌడ్( రాజసింగ్ పై సస్పెన్షన్ కొనసాగితే)
30.ఖైరతాబాద్ – చింతల రామచందర్ రెడ్డి..
31.అంబర్ పేట – కిషన్ రెడ్డి

Also Read..Congress Candidates First List : తెలంగాణలో ఎన్నికల హీట్.. కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా సిద్ధం, 10టీవీ ఎక్స్‌క్లూజివ్ రిపోర్ట్

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా (4/14)

32.మహబూబ్‌నగర్ – జితేందర్ రెడ్డి
33.కొల్లాపూర్ – సుధాకరరావు
34.అచ్చంపేట – సతీష్ మాదిగ
35.గద్వాల – డీకే‌.అరుణ

ఉమ్మడి నల్లగొండ జిల్లా ( 2/ 12)

36.మునుగోడు – కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి
37.సూర్యాపేట – సంకినేని వెంకటేశ్వరరావు

ఉమ్మడి వరంగల్‌ జిల్లా (2/12)

38.వరంగల్ పశ్చిమం – రావు పద్మ
39.వరంగల్ తూర్పు – ఎర్రబెల్లి ప్రదీప్ రావు