Assembly Elections 2023 : తెలంగాణలో ఎన్ని నామినేషన్లు దాఖలయ్యాయో తెలుసా? కేసీఆర్ నియోజకవర్గంలో అత్యధికంగా నామినేషన్లు

సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో అత్యధికంగా 145 నామినేషన్లు దాఖలయ్యాయి. కేసీఆర్ పోటీచేస్తున్న మరో నియోజకవర్గం కామారెడ్డిలో

CM KCR nomination

Telangana Assembly Elections 2023 : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల దాఖలు ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది. పలు నియోజకవర్గాల్లో భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. తెలంగాణలో మొత్తం 5716 నామినేషన్లు దాఖలు కాగా, మొత్తం 4355 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ముఖ్యంగా సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో అత్యధికంగా 145 నామినేషన్లు దాఖలయ్యాయి. కేసీఆర్ పోటీచేస్తున్న మరో నియోజకవర్గం కామారెడ్డిలో 90 నామినేషన్లు దాఖలయ్యాయి.

Also Read : PM Modi : తెలంగాణలో మూడ్రోజులు ఎన్నికల ప్రచారంలో పాల్గోనున్న ప్రధాని మోదీ .. 27న హైదరాబాద్లో భారీ రోడ్ షో

గజ్వేల్ నియోజకవర్గం తరువాత అత్యధికంగా మేడ్చల్ నియోజకవర్గంలో 99 నామినేషన్లు దాఖలయ్యాయి. ఎల్బీనగర్ నియోజకవర్గంలో 78 నామినేషన్లు దాఖలు కాగా.. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేంద్ర పోటీ చేస్తున్న హుజారాబాద్ నియోజకవర్గంలో 52 నామినేషన్లు దాఖలయ్యాయి. మంత్రి హరీష్ రావు నియోజకవర్గం సిద్ధిపేటలో 62 నామినేషన్లు, రేవంత్ రెడ్డి నియోజకవర్గం కొడంగల్ లో 23 నామినేషన్లు దాఖలయ్యయి.