Telangana Assembly : హాట్ హాట్ గా తెలంగాణ అసెంబ్లీ.. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి తలసాని ఆగ్రహం

రాజగోపాల్ రెడ్డి కాంట్రాక్టరు కాబట్టి..కాంట్రాక్టుల గురించి మాట్లాడాలంటే సభ నుంచి బయటికి వెళ్లిపోవాలని, సభ బయట మాట్లాడుకోవాలని తలసాని అనగా, రాజగోపాల్ రెడ్డి గట్టిగా కౌంటర్ ఇచ్చారు.

Telangana Assembly meetings : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మధ్య మాటల యుద్ధం నడిచింది. ప్రాజెక్టుల పేరుతో కోట్లాది రూపాయలు కాంట్రాక్టర్లకు దోచి పెడుతున్నారన్న రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి తలసాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజోగపాల్ రడ్డి సభలో కాంట్రాక్టులు తప్ప మరో సమస్య గురించి మాట్లాడటం లేదని తలసాని అన్నారు.

రాజగోపాల్ రెడ్డి కాంట్రాక్టరు కాబట్టి..కాంట్రాక్టుల గురించి మాట్లాడాలంటే సభ నుంచి బయటికి వెళ్లిపోవాలని, సభ బయట మాట్లాడుకోవాలని తలసాని అనగా.. రాజగోపాల్ రెడ్డి గట్టిగా కౌంటర్ ఇచ్చారు. పొద్దంతా పేకాట ఆడేవాళ్లు మంత్రులు కాగా లేనిది కాంట్రాక్టర్ గా తాను మాట్లాడితే తప్పా అని అన్నారు. తలసానిని అవమానించేలా మాట్లాడిన రాజగోపాల్ రెడ్డి క్షమాపణ చెప్పాలని మంత్రులు పువ్వాడ, ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

Telangana assembly : అసెంబ్లీలో ఇంట్రెస్టింగ్ సీన్.. ఎమ్మెల్యే రసమయి మాట్లాడుతుండగా మైక్ కట్ చేసిన డిప్యూటీ స్పీకర్

అటు రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. రాజగోపాల్ రెడ్డికి ఎందుకింత అసహనం అన్నారు. ఐదు రాష్ట్రాల్లో అడ్రస్ లేని పార్టీ కాంగ్రెస్ అంటూ ఎద్దేవా చేశారు. రాజగోపాల్ రెడ్డి క్షమాపణలు చెప్పకుంటే చర్యలు తీసుకోవాలన్నారు. రాజగోపాల్ రెడ్డి క్షమాపణ చెప్పాలని మంత్రి ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

కాగా, తలసాని, రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు రికార్డుల నుంచి తొలగించాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క పేర్కొన్నారు. చిరకు ఆవేశంలో చేసిన వ్యాఖ్యలను రాజగోపాల్ రెడ్డి ఉపసంహరించుకున్నారు. ఒకవేళ తాను మాట్లాడింది తప్పైతే వాళ్ల మొక్కి నీళ్లు నెత్తిన పోసుకుంటానని చెప్పారు. తాను మాట్లిడిన దాంట్లో ఏమైనా తప్పుంటే తన పదవికి రాజీనామా చేయడమే కాదు మంత్రుల కాళ్లు కడిగి నెత్తిన పోసుకుంటానని అన్నారు.

ట్రెండింగ్ వార్తలు