Telangana Assembly polls
Telangana Assembly polls: మరి కొన్ని నెలల్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో వీలైనన్ని ఎక్కువ సీట్లు సాధించేలా బీజేపీ ప్రణాళికలు వేసుకుటోంది. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ సహా పార్టీ ఇతర నేతలతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి అమిత్ షా సహా పలువురు జాతీయ నేతలు మంగళవారం చర్చలు జరిపారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మంత్రి మనీశ్ సిసోడియా అరెస్టు అయిన విషయం తెలిసిందే. ఆ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, సీఎం కేసీఆర్ కూతురు కె.కవిత కూడా ఉన్నారని, తదుపరి ఆమె అరెస్టు కావచ్చని బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఓ వైపు లిక్కర్ స్కాం ప్రకంపనలు మరోవైపు తెలంగాణలో ముందస్తు ఎన్నికల ఊహాగానాల నేపథ్యంలో ఇవాళ బీజేపీ తెలంగాణ నేతలతో జాతీయ నేతలు చర్చలు జరపడం గమనార్హం.
తెలంగాణలో ఇప్పటికే బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎన్నికల హడావుడి మొదలు పెట్టాయి. అనేక కార్యక్రమాలతో ప్రజల ముందుకు వెళ్తున్నాయి. దీంతో, బీజేపీ కూడా ప్రచార హోరు పెంచడానికి సిద్ధమైంది. వచ్చే నెల 119 అసెంబ్లీ నియోజక వర్గాల్లోనూ ర్యాలీలు జరపాలని నిర్ణయించింది. ఒకవేళ తెలంగాణలో షెడ్యూలు కంటే కొన్ని నెలల ముందుగానే ఎన్నికలు జరిగినా సిద్ధంగా ఉండాలని భావిస్తోంది.
Bhainsa: భైంసాలో ఆర్ఎస్ఎస్ ర్యాలీకి హైకోర్టు అనుమతి.. షరతులు విధింపు!