Revanth Reddy (Image Credit To Original Source)
Telangana Assembly: బహిరంగ సభల్లో మాట్లాడినదానికంటే శాసనసభలో మాట్లాడిన మాటకు విలువ ఎక్కువ ఉంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కృష్ణా, గోదావరి జలాలపై రేవంత్ రెడ్డి ఇవాళ శాసనసభలో మాట్లాడారు.
“కేసీఆర్ తన అనుభవంతో ప్రభుత్వానికి సూచనలు ఇస్తారని ఆశించాం. రెండేళ్లుగా ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రాకపోవడం విచారకరం. కృష్ణా జలాలపై ఉత్తమ్ కుమార్ రెడ్డి విషయాలు, వాస్తవాలు తెలిపారు. కృష్ణా జలాలపై ఒకరోజు, గోదావరి జలాలపై ఒకరోజు చర్చిద్దామని అనుకున్నాం.
Also Read: దరిద్రదేవత మీ జోలికి రావద్దన్నా.. లక్ష్మీ కటాక్షంతో మీకు డబ్బులు రావాలన్నా ఇలా చేయాలి..
చర్చపెట్టి కార్యాచరణ రూపొందించాలని భావించాం. గతంలో బీఆర్ఎస్ నేతలు అవమానించినా కాంగ్రెస్ నేతలు వచ్చి మాట్లాడేవారు. ప్రతిపక్ష నేతలు సభలో మాట్లాడకపోతే అంతిమంగా ప్రజలకే అన్యాయం జరుగుతుంది” అని అన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో, గత బీఆర్ఎస్ పాలనలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు అన్యాయం జరిగిందని రేవంత్ రెడ్డి చెప్పారు. నదీ జలాల కేసీఆర్ ఇటీవల ప్రెస్‌మీట్‌లో మాట్లాడితే ఇప్పుడు అసెంబ్లీకి కూడా వచ్చి రాష్ట్రానికి ఉపయోగపడే సలహాలు ఇస్తారని అనుకున్నానని తెలిపారు.
కృష్ణా జలాలపై కేసీఆర్ చర్చను తెరపైకి తెచ్చారని రేవంత్ రెడ్డి అన్నారు. ఇటువంటి విషయాలు పార్టీ ఆఫీసుల్లో మాట్లాడితే ప్రజల్లో గందరగోళం నెలకొంటుందని, దీంతో అసెంబ్లీలో చర్చ చేపట్టామని అన్నారు. అయినప్పటికీ కేసీఆర్ మాత్రం సభకు రాలేదని విమర్శించారు.
బీజేపీ వాకౌట్
మరోవైపు, సభ నుంచి బీజేపీ వాకౌట్ చేసింది. సీఎం మాట్లాడే ముందు తమకు సభలో మాట్లాడే అవకాశం ఇవ్వలేదని బీజేఎల్పీ లీడర్ మహేశ్వర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ తరఫున 25 మంది ఎమ్మెల్యేలు మాట్లాడారని, బీజేపీ నుంచి ఓకే సభ్యునికి అవకాశం ఇస్తే, అది కూడా 15 నిమిషాలు కూడా సమయం ఇవ్వలేదని తెలిపారు. బీఆర్ఎస్ ఎలాగో లేనే లేదని, ప్రతిపక్షంగా తమకు అవకాశం ఇవ్వచ్చు కదా? అని నిలదీశారు.