BRS MLAs Suspended : బ్రేకింగ్ న్యూస్.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు బిగ్ షాక్.. అసెంబ్లీ నుంచి సెషన్ మొత్తం సస్పెండ్..
BRS MLAs Suspended : బీఆర్ఎస్ సభ్యులను అసెంబ్లీ నుంచి సస్పెండ్ అయ్యాడు. సెషన్ మొత్తం సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించారు.
- Harish Thanniru
- Updated on- September 9, 2026 / 11:08 AM IST
BRS MLAs Suspended
BRS MLAs Suspended : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు ( బుధవారం) ప్రారంభమయ్యాయి. ప్రారంభం నుంచి బీఆర్ఎస్ సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో అధికార, విపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఎంత చెప్పినా బీఆర్ఎస్ సభ్యులు వినకపోవటంతో సభలో తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొంది. మంత్రులు మాట్లాడుతున్న సమయంలో స్పీకర్ పోడియంను చుట్టుముట్టి నినాదాలు చేశారు.
Also Read : Telangana Farmers : అన్నదాతలకు శుభవార్త.. వర్షాలపై వాతావరణ శాఖ బిగ్ అప్డేట్.. ఆ వారంరోజులు వానలేవానలు..
మంగళవారం ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌజ్ ముట్టడికి కాంగ్రెస్ ఎస్సీ సెల్ ప్రయత్నించిన క్రమంలో తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ విషయంలో తమకు న్యాయం చేయాలంటూ.. కేసీఆర్ చావును కోరిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ.. వీ వాంట్ జస్టిస్ అంటూ పెద్దెత్తున్న బీఆర్ఎస్ సభ్యులు నినాదాలు చేశారు. దీంతో బీఆర్ఎస్ సభ్యులను సస్పెండ్ చేయాలని శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు స్పీకర్ ను కోరారు. స్పీకర్ బీఆర్ఎస్ సభ్యులను వారించినప్పటికీ.. వారు వినకపోవటంతో.. కేటీఆర్, హరీశ్, జగదీశ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, పాడి కౌశిక్ రెడ్డితోపాటు మొత్తం 21 మంది బీఆర్ఎస్ సభ్యులను అసెంబ్లీ నుంచి ఈ సెషన్ మొత్తం సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.
బీఆర్ఎస్ సభ్యులు సస్పెండ్ తరువాత అసెంబ్లీ ఆవరణలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలోకి వెళ్లేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రయత్నించగా.. వారిని మార్షల్స్ అడ్డుకున్నారు. సభ నుంచి సస్పెండ్ కావడంతో కార్యాలయంలోకి వెళ్లేందుకు అనుమతి లేదని మార్షల్స్ స్పష్టం చేశారు. కేటీఆర్, హరీశ్ రావుతోపాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మార్షల్స్ అడ్డుకున్నారు. దీంతో వారు మార్షల్స్ తో వాగ్వివాదంకు దిగడంతో కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
