Guinness World Record: తెలంగాణ బతుకమ్మ గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది. హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ స్టేడియంలో భారీ బతుకమ్మ చుట్టూ వేలాది మంది మహిళలు ఏకకాలంలో బతుకమ్మ ఆడడంలో రెండు రికార్డులు నమోదు చేసినట్లు గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డు ప్రతినిధులు ప్రకటించారు. అతిపెద్ద జానపద నృత్యంతో పాటు అతిపెద్ద బతుకమ్మగా రెండు రికార్డులు సృష్టించింది.
సరూర్ నగర్ స్టేడియంలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లక్ష్యంగా 64 అడుగుల మహా బతుకమ్మ వేడుకను నిర్వహించారు. ఇందులో వేలాది మంది మహిళలు పాల్గొన్నారు.
సరూర్ నగర్ స్టేడియంలో మహా బతుకమ్మ వేడుకలకు రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, సీతక్క, ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, టూరిజం ఎండీ వల్లూరి క్రాంతి, సెర్ప్ సీఈవో దివ్య, బహుజన బతుకమ్మ నిర్వహణ కమిటీ నిర్వాహకురాలు విమలక్క, తదితరులు పాల్గొన్నారు.