Bandi Sanjay Padayatra : హుజూరాబాదా..? హుస్నాబాదా..? ప్రజా సంగ్రామ యాత్ర ముగింపుసభ ఎక్కడ?

తెలంగాణలో అధికారంలోకి రావటమే లక్ష్యంగా బీజీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర రేపు కరీంనగర్ జిల్లా లోకి  ప్రవేశిస్తుంది.

Bandi Sanjay Padayatra : బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు బండిసంజయ్ చేపట్టిన ప్రజాసంగ్రామయాత్ర ముగింపు సభ ఎక్కడ పెట్టాలనేదానిపై నేతల్లో చర్చ మొదలయ్యింది. తెలంగాణలో అధికారంలోకి రావటమే లక్ష్యంగా ఎంపీ బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర రేపు కరీంనగర్ జిల్లా లోకి  ప్రవేశిస్తుంది. హుజూరాబాద్ ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించటంతో కరీనంగర్ జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం బహిరంగ సభలకు 500 మందికి మించి ప్రజలను అనుమతించరు. సంజయ్ వెంట పాదయాత్రలో వేలాది మంది కార్యకర్తలు పాల్గోంటున్నారు.

ఎన్నికలకోడ్ అమల్లోకి రావటంతో బండి సంజయ్ పాదయాత్రకు ఇప్పడు ఇబ్బందులు ఏర్పడ్డాయి. జూలై28న  చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయం వద్ద నుంచి బండి సంజయ్  ప్రారంభించిన ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు ర్యాలీ,సభను గాంధీ జయంతి రోజు అక్టోబర్ 2న నిర్వహించాలని ముందుగా ప్లాన్ చేశారు. కానీ ఇప్పుడు ఎన్నికల కోడ్ అమల్లోకి రావటంతో ఆటంకాలు ఏర్పడ్డాయి. దీంతో ఇప్పుడు ముగింపు సభను ఎక్కడ నిర్వహించాలనే దానిపై కమలనాధులు సమాలోచనలు చేస్తున్నారు. ఈరోజు ఉ దయం జరిగే పాదయాత్ర  కమిటీ సమావేశంలో దీనిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సభను హుజూరాబాద్ లో నిర్వహించాలా, హుస్నాబాద్ లో నిర్వహించాలా అనేది మరికొద్ది సేపట్లో తేలనుంది.

ట్రెండింగ్ వార్తలు