Bandi
Bandi Sanjay jagarana deeksha : జీవో నెంబర్ 317ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఇవాళ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వినూత్న నిరసన చేపట్టనున్నారు. ఇవాళ రాత్రంతా ఆయన జాగరణ దీక్ష చేపట్టనున్నారు. నిద్రపోతున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని మేల్కొలపడానికే ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు వెల్లడించారు బండి సంజయ్. కరీంనగర్‌లోని తన కార్యాలయంలో ఇవాళ రాత్ర 9గంటల నుంచి రేపు ఉదయం 5గంటల వరకు ఈ జాగరణ కార్యక్రమం కొనసాగనుంది.
నీళ్లు, నిధులు, నియామకాల పేరిట తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగ, ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించారని బండి సంజయ్ అన్నారు. చారిత్రకమైన సకల జనుల సమ్మె, మిలియన్ మార్చ్, సాగరహారం వంటి కార్యక్రమాలను నిర్వహించారని తెలిపారు. తాజాగా కొత్త జోనల్ వ్యవస్థలో భాగంగా రీ అలాట్ మెంట్ పేరుతో టీఆర్‌ఎస్ ప్రభుత్వం జారీ చేసిన 317 జీవో ప్రభుత్వ ఉద్యోగులను తీవ్ర మానసిక క్షోభకు గురిచేస్తోందన్నారు.
GST : ఏపీఎస్ఆర్టీసీలో జీఎస్టీ వడ్డన
బదిలీల ప్రక్రియ పేరుతో ఈ జీవోను అమలు చేస్తే లక్షలాది ఉద్యోగులు, ఉపాధ్యాయులు స్థానికేతరులుగా మారే ప్రమాదం ఏర్పడుతుందన్నారు. రాష్ట్రంలో రైతులు, నిరుద్యోగులు, ఉద్యోగులు చనిపోతున్నా సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ దాటి రావడం లేదని విమర్శించారు. వెంటనే 317జీవోను ఉపసంహరించుకోవాలని లేకపోతే..ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని బండి సంజయ్ హెచ్చరించారు