×
Ad

Telangana : కూలీతో టీచర్ అక్రమ సంబంధం.. అడ్డొస్తున్నాడని భర్తను చంపేసి.. గుండెపోటు అంటూ డ్రామా.. చివరికి..

woman kills husband with lover : మహేశ్‌తో తన భార్య పూర్ణిమ చనువుగా ఉండటాన్ని గమనించిన అశోక్ పలుసార్లు మందలించాడు. అయినా, పూర్ణిమలో ..

woman kills husband with lover

woman kills husband with lover : కొందరు మహిళలు పరాయి పురుషుడి మోజులో పడి భర్తలను హతమార్చుతున్న ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. మూడ్రోజుల క్రితం యూపీలో ఓ భార్య తన ప్రియుడితో గడిపేందుకు భర్త అడ్డొస్తున్నాడని అతన్ని హత్యచేసి.. శరీర భాగాలను ముక్కలుముక్కలుగా చేసింది. తాజాగా.. తెలంగాణలోనూ ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ.. అతడి మోజులోపడి కట్టుకున్న భర్తను దారుణంగా కడతేర్చింది. పైగా తన భర్త గుండెపోటుతో చనిపోయాడని డ్రామా ఆడింది.. కానీ, పోలీసులు రంగంలోకి దిగడంతో అసలు గుట్టు వీడింది. వివరాల్లోకి వెళితే..

Also Read: Government Employees : ఆఫీసులకు అలా రావొద్దు.. ఉద్యోగులకు ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ

కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన వి.జె. అశోక్ (45), జె. పూర్ణిమ(36)లకు 2011లో పెండ్లి జరిగింది. వీరికి 12ఏళ్ల కుమారుడు ఉన్నాడు. వీరు బోడుప్పల్ ప్రాంతంలోని ఈస్ట్ బృందావన్ కాలనీలో నివాసం ఉంటున్నారు. అశోక్ ఓ ఇంజినీరింగ్ కాలేజీలో లాజిస్టిక్స్ మేనేజర్ గా పనిచేస్తున్నాడు. పూర్ణిమ ఇంటి వద్దే ప్లే స్కూల్ నిర్వహిస్తోంది. అయితే, గతంలో వీరు బోడుప్పల్ లోని మరో ప్రాంతంలో నివాసం ఉన్నారు. ఆ సమయంలో ఏపీలోని ప్రకాశం జిల్లాకు చెందిన నిర్మాణ కూలీ పాలేటి మహేశ్ (22)తో పూర్ణికు వివాహేతర సంబంధం ఏర్పడింది.

మహేశ్‌తో తన భార్య పూర్ణిమ చనువుగా ఉండటాన్ని గమనించిన అశోక్ పలుసార్లు మందలించాడు. అయినా, పూర్ణిమలో మార్పురాకపోవడంతో భార్యాభర్తల మధ్య గొడవలు జరిగాయి. ప్రియుడితో వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడనే కోపంతో పూర్ణిమ తన భర్తను హత్యచేసేందుకు నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని ప్రియుడు మహేశ్‌కు తెలిపింది. మహేశ్ యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన తన స్నేహితుడు భూక్యా సాయికుమార్ (22) సాయం కోరాడు. ఇంటిలోనే మహేశ్‌ను హత్యచేసి గుండెపోటుగా చిత్రీకరించేందుకు ముందుగానే ప్లాన్ చేసుకున్నారు.

ఈనెల 11వ తేదీన సాయంత్రం అశోక్ కళాశాల నుంచి ఇంటికిరాగా అప్పటికే ఇంట్లో ఉన్న మహేశ్, సాయికుమార్‌లు అతన్ని కొట్టి కిందపడేశారు. పూర్ణిమ, సాయి గట్టిగా పట్టుకోగా.. మహేశ్ మూడు చున్నీలను మెడకు బిగించి ఊపిరాడకుండా చేశాడు. చనిపోయాడని నిర్ధారించుకున్న తరువాత మహేశ్, సాయి అక్కడి నుంచి వెళ్లిపోయారు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు తన భర్త గుండెపోటుతో మరణించాడని పూర్ణిమ నాటకం ఆడింది.

తన భర్త గుండెపోటుతో మరణించాడని.. అతని మృతిపై తమకు ఎలాంటి అనుమానాలు లేవని పూర్ణిమ పోలీసులకు కట్టుకథ చెప్పింది. బంధువులతోనూ ఇదే చెప్పింది. అయితే, మృతుడి ఒంటిపై గాయాలు ఉండటంతో పోలీసులు తొలుత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అయితే, విచారణ సమయంలో పూర్ణిమ ప్రవర్తనపై అనుమానం రావడంతో ఆమెను గట్టిగా విచారించారు. ఆ తరువాత పూర్ణిమ ఇంటి వద్ద సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించి పూర్ణిమ తన ప్రియుడితో కలిసి భర్తను హత్యచేసిందని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. పూర్ణిమతోపాటు ఆమె ప్రియుడు మహేశ్, సాయి కుమార్‌లను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ముగ్గుర్నీ సోమవారం రిమాండ్ కు తరలించారు.