Telangana Bonalu : జులై 11న ‘గోల్కొండ బోనాలు’

ఆషాడ మాసంలో అమావాస్య తర్వాత వచ్చే గురువారం కానీ, ఆదివారం కానీ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. జులై నెలలో 10 తేదీ అమావాస్య వస్తుంది.. మరుసటి రోజు ఆదివారం కావడంతో జులై 11న బోనాలు ప్రారంభం కానున్నాయి. గోల్కొండ ఎల్లమ్మ దేవాలయంలో మొదటి పూజ జరిగిన తర్వాత తెలంగాణలోని ఇతర జిల్లాలోని ఆలయాల్లో బోనాలు ప్రారంభం అవుతాయి. హైదరాబాద్ నగరంలో బోనాల వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. ఇక ఈ వేడుకలు ఆగష్టు 9న ముగుస్తాయి.

Telangana Bonalu

Telangana Bonalu : ఆషాడ మాసం వచ్చిందంటే తెలంగాణలో పండుగ వాతావరణం నెలకొంటుంది. నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఇక ఈ ఏడాది జులై 11 నుంచి బోనాల వేడుకలు ప్రారంభం కానున్నాయి. కాగా కరోనా కారణంగా గతేడాది బోనాల ఉత్సవాలకు భక్తులను అనుమతించలేదు..ఆలయ కమిటీ సభ్యులే ఉత్సవాలు జరిపించారు.

ఈ సారి లాక్ డౌన్ పూర్తిగా తొలగించడంతో వేడుకలకు అడ్డంకులు తొలగిపోయాయి. దీంతో అధికారులు ఏర్పాట్లు మొదలు పెట్టారు. సంప్రదాయం ప్రకారం గోల్కొండ కోటలోని శ్రీ జగదాంబిక (ఎల్లమ్మ) ఆలయంలో బోనాలు ప్రారంభం కావడం ఆనవాయితీ.

ఆషాడ మాసంలో అమావాస్య తర్వాత వచ్చే గురువారం కానీ, ఆదివారం కానీ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. జులై నెలలో 10 తేదీ అమావాస్య వస్తుంది.. మరుసటి రోజు ఆదివారం కావడంతో జులై 11న బోనాలు ప్రారంభం కానున్నాయి. గోల్కొండ ఎల్లమ్మ దేవాలయంలో మొదటి పూజ జరిగిన తర్వాత తెలంగాణలోని ఇతర జిల్లాలోని ఆలయాల్లో బోనాలు ప్రారంభం అవుతాయి.

హైదరాబాద్ నగరంలో బోనాల వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. ఇక ఈ వేడుకలు ఆగష్టు 8న ముగుస్తాయి.

 

జూలై 11న మొదటి పూజ

15న రెండో పూజ

18న మూడో పూజ

22న నాలుగో పూజ

25న ఐదవ పూజ

29న ఆరవపూజ

ఆగస్టు 1న ఏడో పూజ

5న ఎనిమిదవ పూజ

8న తొమ్మిదవ పూజ