Telangana Budget: నేడే తెలంగాణ బడ్జెట్

తెలంగాణ బడ్జెట్(2022-23)కు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. సోమవారం శాసనభలో ఆర్థిక మంత్రి హరీశ్ రావు ప్రవేశపెట్టనున్నారు. ఆదివారం సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ఏర్పాటైన మంత్రిమండలి అసెంబ్లీ

Telangana Budget: తెలంగాణ బడ్జెట్(2022-23)కు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. సోమవారం శాసనభలో ఆర్థిక మంత్రి హరీశ్ రావు ప్రవేశపెట్టనున్నారు. ఆదివారం సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ఏర్పాటైన మంత్రిమండలి అసెంబ్లీ నిర్వహణపై చర్చలు జరిపింది. సమావేశంలో బడ్జెట్‌కు ఏకగ్రీవంగా ఆమోదం దక్కింది.

బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రతిపక్షాలు సంధించే ప్రశ్నలను సమర్థంగా ఎదుర్కోవాలని మంత్రులకు, ఎమ్మెల్యేలకు సూచించారు సీఎం కేసీఆర్. సమావేశాలు సజావుగా సాగేందుకు ప్రతిపక్షాలపై పైచేయి సాధించాలని సూచించారు.

తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్‌రావు చేతుల మీదుగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22)లో రూ.2,30,825.96 కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా.. తాజాగా రూ.2.70లక్షల కోట్ల వరకు ఉండే అవకాశం కనిపిస్తుంది.

Read Also : రేపటి నుంచే తెలంగాణ బడ్జెట్ సమావేశాలు

తొలిసారి తెలంగాణ రాష్ట్రంలో గవర్నర్ ప్రసంగం లేకుండా బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ వ్యవహారంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నా సీఎం కేసీఆర్ తగ్గేదే లేదంటున్నారు.

ట్రెండింగ్ వార్తలు