Cess Election In Telangana : హీట్ పుట్టిన్న రాజన్న సిరిసిల్ల జిల్లా ‘సెస్’ ఎన్నికలు

Telangana : rajanna siricilla cess directors election

cess election In rajanna siricilla : ఇటీవల కాలంలో తెలంగాణలో ఎటువంటి ఎన్నికలు వచ్చినా హీట్ మామూలుగా ఉండటంలేదు. ఉప ఎన్నిక నుంచి పంచాయితీ ఎన్నికలు, ఆఖరికి సెస్ ఎన్నికల్లో కూడా రాజకీయ హీట్ మామూలుగా ఉండటంలేదు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరుగుతున్న సహకార విద్యుత్ సరఫరా సంఘం ( సెస్ ) ఎన్నికల పోలింగ్ కూడా పొలిటికల్ హీట్ పుట్టిస్తోంది. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, సీఎం కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న జిల్లా కావటంతోనే ఈ హీట్ కొనసాగుతోంది.15 డైరెక్టర్ స్థానాలకు కొనసాగుతున్న సెస్ ఎన్నికల్లో రాజన్న సిరిసిల్ల జిల్లాలో పొలిటికల్ హీట్ పుట్టిస్తున్నాయి. ఈ సెస్ ఎన్నికల బరిలో 75మంది అభ్యర్థులు పోటీ పడుతుండా ఓటు హక్కు వినియోగించుకునేవారు 87,130మంది ఉన్నారు.

శనివారం (డిసెంబర్ 24,2022) ఉదయం 8 గంటలకు సెస్ ఎన్నికల పోలింగ్ ప్రారంభంకాగా సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. మొత్తం 15 డైరెక్టర్ స్థానాలకు ప్రధాన పార్టీలతో పాటు ఇండిపెండెంట్లు, రెబెల్స్​ కలిపి 75 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 750 మంది ఎన్నికల సిబ్బంది, 15 మంది రూట్ ఆఫీసర్లు డ్యూటీల్లో ఉన్నారు. ఈ ఎన్నికలకు పోలీసు బందోబస్తు కూడా మామూలుగా లేదు.ఏకంగా 1100 మంది పోలీసులతో బందోబస్తుగా ఉండి పోలింగ్ సెంటర్ల వద్ద కాపుకాస్తున్నారు. ఈ సెస్ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవటంతో సెస్ ఎన్నికలు కూడా రసవత్తరంగా కొనసాగుతున్నాయి.