Telangana : సీఎం కేసీఆర్ జిల్లాల బాట.. జనగామలో బహిరంగసభ

ఈ సభపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రధాని మోదీ రాజ్యసభలో చేసిన వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్‌ ఎలాంటి కౌంటర్ ఇవ్వబోతున్నారనే దానిపై ఉత్కంఠ నెలకొంది...

CM KCR Dist Tour : తెలంగాణ సీఎం కేసీఆర్‌ జిల్లాల బాట పడుతున్నారు. 2022, ఫిబ్రవరి 11వ తేదీ శుక్రవారం జనగామ జిల్లాతో ఈ పర్యటన మొదలుపెట్టబోతున్నారు. జనగామ జిల్లాలో కొత్తగా నిర్మించిన జిల్లా సమీకృత భవన సముదాయంతోపాటు టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు గులాబీ బాస్‌. ఆ తర్వాత యశ్వంతాపూర్‌ దగ్గర నిర్వహించనున్న సభలో ప్రసంగించనున్నారు. ఉదయం 11గంటలకు హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి.. 11.30గంటలకు జనగామకు చేరుకుంటారు. ముందుగా కలెక్టరేట్‌ భవనం ప్రారంభిస్తారు.

Read More : DJ Tillu : సినిమా రిలీజ్ అవ్వకుండానే సీక్వెల్ ప్లానింగ్..

మధ్యాహ్నం 12.20గంటల నుంచి 1.20గంటల వరకు ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. మధ్యాహ్నం మూడున్నర గంటలకు సభా ప్రాంగణానికి చేరుకొని ప్రసంగిస్తారు సీఎం. దీంతో ఈ సభపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రధాని మోదీ రాజ్యసభలో చేసిన వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్‌ ఎలాంటి కౌంటర్ ఇవ్వబోతున్నారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే గులాబీ శ్రేణులు భారీగా నిరసన కార్యక్రమాలు చేపట్టిన సంగతి తెలిసిందే.

Read More : Statue of Equality : రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు.. పదో రోజు కార్యక్రమాలు

అంతేగాకుండా మంత్రులు, టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు బీజేపీపై విమర్శలు గుప్పిస్తున్నారు. రాజ్యసభ కార్యాలయంలో ప్రధాని మోదీపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు టీఆర్ఎస్ ఎంపీలు బహిరంగ సభకు భారీగా జన సమీకరణ చేస్తున్నారు గులాబీ నేతలు. తెలంగాణ మంత్రులు ఏర్పాట్లను దగ్గరుండి పరిశీలిస్తున్నారు. ఇప్పటికే సీఎం కేసీఆర్‌ జనగామ జిల్లా టూర్‌పై మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా దివ్యాంగులకు మూడు చక్రాల స్కూటీలు పంపిణీ చేయనున్నట్లు మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. 105 మంది దివ్యాంగులకు అందజేయనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.

ట్రెండింగ్ వార్తలు