Statue of Equality : రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు.. పదో రోజు కార్యక్రమాలు

నితిన్‌ గడ్కరీ సహస్రాబ్ది ఉత్సవాల్లో పాల్గొననున్నారు. 108 దివ్యదేశాలను సందర్శించనున్నారు. అలాగే ఎల్లుండి ముచ్చింతల్‌కు రానున్నారు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌.

Statue of Equality : రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు.. పదో రోజు కార్యక్రమాలు

Samata

Sri Chinna Jeeyar Swamiji : ముచ్చింతల్ మహాక్షేత్రంలో పదోరోజు శ్రీభగవత్‌ రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు.. అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నాయి. సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో ఆధ్యాత్మిక వైభవం వెల్లివిరుస్తోంది. శుక్రవారం ఉదయం 6:30 గంటలకు అష్టాక్షరీ మంత్ర పఠనం చేశారు. 7:30 గంటలకు శ్రీరామ పెరుమాళ్‌స్వామికి ప్రాతకాల ఆరాధన నిర్వహించనున్నారు. ఉదయం 8 గంటలకు వేద పారాయణం, 9 గంటలకు శ్రీలక్ష్మీనారాయణ మహా యజ్ఞం జరగనుంది. ఉదయం 9:45 గంటలకు 108 దివ్య దేశాల్లోని 36 దేవాలయాల్లో.. ప్రాణ ప్రతిష్ట, కుంభాభిషేకం, మహా సంప్రోక్షణ కార్యక్రమం జరపనున్నారు.

Read More : మీ గూగుల్ అకౌంట్లో డేటాను ఇలా ప్రొటెక్ట్ చేసుకోండి

ఉదయం 10 గంటలకు ఇష్టిశాలలో విద్యాప్రాప్తి కోసం హయగ్రీవ ఇష్టి, ఉదయం 10:30 గంటలకు ప్రవచన మండపంలో శ్రీలక్ష్మీనారాయణ అష్టోత్తర పూజ, మధ్యాహ్నం 12:30 గంటలకు పూర్ణాహుతి, మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రముఖులచేత ప్రవచనాలు, కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సాయంత్రం 5 గంటలకు శ్రీలక్ష్మీనారాయణ మహా యజ్ఞం, రాత్రి 9 గంటలకు పూర్ణాహుతి జరపనున్నారు.

Read More : Saudi Arabia : కరోనాతో విదేశాల్లో 4,355 మంది భారతీయులు మృతి.. సౌదీలోనే అత్యధికం..!

ఇక కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ సహస్రాబ్ది ఉత్సవాల్లో పాల్గొననున్నారు. 108 దివ్యదేశాలను సందర్శించనున్నారు. అలాగే ఎల్లుండి ముచ్చింతల్‌కు రానున్నారు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌. గురువారం కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు రవిశంకర్, ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్‌తో పాటు కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్‌ప్రసాద్ పాల్గొన్నారు.