Kcr
KCR Met With Ex Govvernor Narasimhan : తెలంగాణ రాష్ట్ర మాజీ గవర్నర్ నరసింహన్ అస్వస్థతకు గురయ్యారు. కుటుంబసభ్యులు చెన్నైలోని కావేరీ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. సోమవార ఆయనకు శస్త్ర చికిత్స చేసినట్లు సమాచారం. మరో మూడు లేదా నాలుగు రోజులు ఆసుపత్రిలో ఉండనున్నారని సమాచారం. తమిళనాడు రాష్ట్ర పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ కు ఈ విషయం తెలిసింది. దీంతో 2021, డిసెంబర్ 15వ తేదీ బుధవారం కావేరీ ఆసుపత్రికి వెళ్లి గవర్నర్ నరసింహన్ ను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
Read More : Balakrishna : ‘అఖండ’ విజయోత్సవ ర్యాలీలో బాలయ్య
సీఎం కేసీఆర్ కుటుంబసమేతంగా తమిళనాడులో పర్యటిస్తున్నారు. 2021, డిసెంబర్ 13వ తేదీ ఉదయం 11 గంటలకు ప్రత్యేక విమానంలో సీఎం కేసీఆర్ కుటుంబసభ్యులు తమిళనాడుకు వచ్చారు. శ్రీరంగంలోని రంగనాథ ఆలయానికి వెళ్లి..స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తిరుగు ప్రయాణంలో చెన్నైకి వచ్చిన సీఎం కేసీఆర్…14వ తేదీ మంగళవారం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే.స్టాలిన్‌తో భేటీ అయ్యారు. కుటుంబ సభ్యులతో కలిసి కేసీఆర్, స్టాలిన్ నివాసానికి వెళ్ళారు. ఈ సందర్భంగా యాదాద్రి ఆలయ పునః ప్రారంభ వేడుకలకు రావాల్సిందిగా సీఎం కేసీఆర్ స్టాలిన్ ను ఆహ్వానించారు. స్టాలిన్‌తో సీఎం కేసీఆర్ భేటీ కావడం ఇది మూడోసారి. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు సమయంలో కరుణానిధి, స్టాలిన్‌ను కలిశారు కేసీఆర్. ఆ తర్వాత ఏపీ సీఎంగా జగన్ ప్రమాణస్వీకారం సమయంలోనూ సమావేశమయ్యారు. ఇప్పుడు మూడోసారి ఆయనను కలిశారు సీఎం కేసీఆర్.
Read More : తెలంగాణలో ఒమిక్రాన్ కలకలం..హైదరాబాద్‌లో రెండు కేసులు
ఇక మాజీ గవర్నర్ నరసింహన్ విషయానికి వస్తే…తెలంగాణ గవర్నర్‌గా నరసింహన్ దాదాపు పదేళ్ల కాలం పాటు పనిచేశారు. 2009 డిసెంబర్‌లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు గవర్నర్‌గా నియమితులైన సంగతి తెలిసిందే. తెలంగాణ ఉద్యమం సమయంలో తీవ్ర ఉద్రిక్తల మధ్య గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర విభజన అనంతరం ఇరు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్ గా బాద్యతలు చేపట్టారు. 2019 వరకు ఆయన రెండు తెలుగు రాష్ట్రాలకు గవర్నర్ గా కొనసాగారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన అనంతరం రెండు రాష్ట్రాలకు ఇద్దరు గవర్నర్లను నియమించారు. తెలంగాణకు తమిళనాడుకు చెందిన తమిళసై సౌందర రాజన్ నియమితులు కాగా…ఏపీకి బిశ్వభూషణ్ హరిచందన్ నియమితులయ్యారు. 2019, సెప్టెంబర్ 8న తమిళిసై తెలంగాణ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టారు.