KCR slams Modi: అదానీ వ్యవహారంపై మోదీ వివరణ ఇవ్వాల్సిందే: శాసనసభలో కేసీఆర్

అదానీ వ్యవహారంపై మోదీ వివరణ ఇవ్వాల్సిందేనని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఇవాళ ఆయన శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. హిండెన్ బర్గ్ లేవనెత్తిన అంశాలపై మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై ఢిల్లీలో తాము ప్రశ్నిస్తున్నామని తెలిపారు.

KCR slams modi

KCR slams Modi: అదానీ వ్యవహారంపై ప్రధాని మోదీ వివరణ ఇవ్వాల్సిందేనని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఇవాళ ఆయన శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. హిండెన్ బర్గ్ లేవనెత్తిన అంశాలపై మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై ఢిల్లీలో తాము ప్రశ్నిస్తున్నామని తెలిపారు.

అదానీ తెలంగాణలోనూ సంస్థను నెలకొల్పుతామని అన్నారని, చివరకు ఆయన పెట్టలేదరని మనం బతికి పోయామని ఎద్దేవా చేశారు. అదానీ వ్యవహారంపై దేశం మొత్తం నిలదీస్తుంటే ప్రధాని మోదీకి ఆక్రోశం పొడుచుకొస్తోందని అన్నారు. లోక్ సభలో అదానీ వ్యవహారం గురించి మాట్లాడకుండా మోదీ ఇతర విషయాలు మాట్లాడారని అన్నారు. మోదీ గెలిచారు.. దేశం ఓడిపోయిందని చెప్పారు. అధికారం ఉందని ఇంత అహంకారమా? అని బీజేపీని నిలదీశారు. ప్రజాస్వామ్యంలో అధికారం ప్రజల దయ అని అన్నారు.

దేశానికి మోదీ కంటే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చేసిందే ఎక్కువ అని అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ గురించి మోదీ మభ్యపెట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పారు. 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ పెద్ద జోక్ అని అన్నారు. మనకంటే మన పక్క దేశాలు బంగ్లాదేశ్, భూటాన్ బెటర్ గా ఉన్నాయని వ్యాఖ్యానించారు. తలసరి ఆదాయంలో భారత్ ర్యాంకు 138గా ఉందని చెప్పారు.

అప్పులు చేయడంలో మోదీని మించిన వారు లేరని కేసీఆర్ విమర్శించారు. దేశాన్ని ప్రైవేటు సంస్థల చేతుల్లో పెట్టారని విమర్శించారు. మన్మోహన్ హయాంలో ద్రవ్యలోటు 4.77 శాతంగా ఉంటే, మోదీ పాలనలో అది 5.1 శాతానికి చేరిందని చెప్పారు. ప్రజాస్వామ్యంలో అధికారం ప్రజల దయ అని కేసీఆర్ అన్నారు. అధికారం ఉందని అహంకాం ప్రదర్శించకూడదని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. పలు అంశాలపై కేంద్రం సమాధానం ఇవ్వడం లేదని తెలిపారు. ఎన్డీఏ అంటే నో డేటా అవైలబుల్ అని విమర్శించారు.

MCD Mayoral Polls: కేజ్రీవాల్ ప్రతిపాదనకు లెఫ్టినెంట్ జనరల్ వీకే సక్సేనా ఆమోదం.. 16న మేయర్ ఎన్నిక..