Telangana Congress : ఆ లక్కీ పోస్టుకోసం కాంగ్రెస్‌లో పోటాపోటీ.. రేసులో కీలక నేతలు.. అనుచరుల కోసం ముఖ్యనేతల లాబీయింగ్.!

Telangana Congress : తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలు లక్కీ పోస్టును దక్కించుకునేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఈ మేరకు రాష్ట్ర, ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ నడుపుతున్నారు.

Telangana Congress party

Telangana Congress : తెలంగాణ కాంగ్రెస్‌లో ఏ పోస్టుకు లేనంత క్రేజ్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులకు ఉంటుంది. వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి.. ఒక లక్కీ పోస్ట్‌గా భావిస్తుంటారు నేతలు. ఎందుకంటే పీపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు పనిచేసిన లీడర్లు ఉన్నత స్థానాలకు ఎదుగుతారనే సెంటిమెంట్ ఉంది. ప్రస్తుతం మంచి పొజిషన్‌లో ఉన్న నేతలంతా కూడా తెలంగాణ ఏర్పడిన తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పనిచేసినవారే. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు అజారుద్దీన్, పొన్నం ప్రభాకర్ ఇలా అందరూ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా పనిచేశారు.

Also Read : New Rules : జనన, మరణాల రిజిస్ట్రేషన్‌పై కొత్త రూల్స్‌.. అక్టోబర్‌ 1 నుంచి అమల్లోకి! ఆలస్యం చేస్తే ఇకఅంతే..

తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదట వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పనిచేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి తర్వాత పీసీసీ చీఫ్‌గా రికార్డ్ స్థాయిలో ఏడేళ్లు పని చేశారు. తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పనిచేసిన భట్టి విక్రమార్క సీఎల్పీ లీడర్‌ అయ్యారు. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఇక రేవంత్ రెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి చేపట్టి తర్వాత.. పీసీసీ చీఫ్.. ఆ తర్వాత సీఎం అయ్యారు. మహేష్ కుమార్ గౌడ్ కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ తర్వాత పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. త్వరలో ఆయనకు కూడా ప్రమోషన్ దక్కబోతుందని ప్రచారం నడుస్తోంది. ఇలా వర్కింగ్ ప్రెసిడెంట్లుగా పనిచేసిన వారికి తర్వాత లక్కీ ఛాన్స్ ఉంటుందనే బలమైన నమ్మకం ఉండటంతో..ఆశావహుల జాబితా పెరిగిపోతోంది.

ముఖ్య నేతలు కూడా తమ వారికి వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ ఇప్పించుకునేందుకు లాబీయింగ్ చేస్తున్నారట. అయితే, ఈ పోస్టుల నియామకం కోసం పెద్ద కసరత్తే జరుగుతోందట. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టులకు పోటీ పడుతున్న పలువురు పేర్లపై అభ్యంతరాలు వ్యక్తం చేశారట. దీంతో దాదాపు రెండేళ్లుగా ఈ పదవుల నియామకం పెండింగ్‌లో పడుతూ వచ్చింది. అనేక రకాల చర్చల తర్వాత.. వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకానికి పార్టీ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనే టాక్ బలంగా వినిపిస్తుంది.

ప్రస్తుతం ఇంచార్జ్‌గా ఉన్న మీనాక్షి నటరాజన్ లండన్ వెళ్తున్నారు. ఇప్పటికే వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టులపై ఆమె హైకమాండ్‌కు రిపోర్ట్ ఇచ్చేశారట. అన్ని సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించాలని అధిష్టానం భావిస్తోందట. రెడ్డి సామాజిక వర్గం నుంచి సీఎం రేవంత్ తన స్నేహితుడు రోహిణ్‌ రెడ్డి కోసం పట్టు బట్టడంతో.. ఇంచార్జ్ మీనాక్షి కూడా ఓకే చెప్పారట. మైనారిటీ వర్గం నుంచి సీఎం రేవంత్.. తన సన్నిహితుడు ఫహీం ఖురేషి పేరు ప్రతిపాదిస్తే ఇంచార్జ్ మీనాక్షి బ్రేక్ వేశారట. ఈ విషయంలో సీఎం కూడా వెనక్కి తగ్గారట. మైనారిటీ వర్గం నుంచి ఓబేదుల్లా కొత్వాల్ పేరు ఖరారైందట. ఎస్టీ వర్గం నుంచి ఎంపీ బలరాం నాయక్.. ఎస్సీ వర్గం నుంచి సంపత్ కుమార్ పేర్లను ఫిక్స్ చేశారని అంటున్నారు.

వర్కింగ్ ప్రెసిడెంట్లతో పాటు పెండింగ్‌లో ఉన్న ప్రచార కమిటీ, మిగిలిన జనరల్ సెక్రటరీలు, వైస్ ప్రెసిడెంట్ పోస్టులను కూడా భర్తీ చేయబోతున్నారట. నామినేటెడ్ పోస్టులకు కూడా హైకమాండ్‌ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చర్చించుకుంటున్నారు. ఈ నియామకాలన్నింటినీ వారం రోజుల్లోగా పూర్తి చేయాలని భావిస్తున్నారట పార్టీ పెద్దలు. ఈ సారైనా వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టులకు గ్రహణం వీడుతుందో.? మళ్లీ ఏదైనా బ్రేకులు పడుతాయో.? చూడాలి మరి.