Telangana (4)
Telangana : తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. సరిహద్దు రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలంగాణలో కరోనా తీవ్రత చాలా తక్కువగా ఉంది. తెలంగాణ ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో 306 కరోనా కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. దీంతో ఇప్పటివరకు 6,59,313 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇక కరోనా మరణాలు కూడా భారీగా తగ్గాయి. శనివారం కేవలం ముగ్గురు మాత్రమే కరోనాతో మరణించారు. కరోనా ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు 3883 మంది మృతి చెందారు.
ఇక తెలంగాణా రాష్ట్రంలో యాక్టివ్ కరోనా కేసులు 5,673 గా ఉన్నాయి. ఇప్పటి వరకు తెలంగాణలో మొత్తం 6,49,757 మంది కరోనా బారిన పడి కోలుకున్నారు. గత 24 గంటల్లో 366 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తెలంగాణలో రికవరీ రేటు 98.55 శాతంగా ఉంది. ఇండియా రికవరీ రేటు 97.40 శాతంగా ఉంది. తెలంగాణలో మరణాలు 0.58% గా ఉన్నాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో 69,422 పరీక్షలు చేశారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పరీక్షలు సంఖ్య 2,49,17,603 కు చేరుకుంది.