Telangana Election 2023 : బీఆర్ఎస్ కు బిగ్ షాకిచ్చిన ఉమ్మడి ఖమ్మం జిల్లా ఓటర్లు.. మళ్లీ అవే ఫలితాలు ..!

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం 10 నియోజకవర్గాలు ఉన్నాయి. ప్రత్యేక తెలంగాణ అనంతరం జరిగిన 2014 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కేవలం ఒక్క నియోజకవర్గంలోనే విజయం సాధించింది.

KCR

Khammam Politics : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ హవా కొనసాగింది. మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువ స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి మరోసారి బిగ్ షాక్ తగిలింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు నుంచి 2014, 2018 ఎన్నికల్లో కేవలం ఒక్క స్థానంకే బీఆర్ఎస్ పరిమితమైంది. ప్రస్తుతం 2023 ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ పార్టీ కేవలం ఒక్క స్థానంకు మాత్రమే పరిమితమైంది.

Also Read : Uttam Kumar Reddy : బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారనడానికి ఫలితాలు నిదర్శనం : ఉత్తమ్

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం 10 నియోజకవర్గాలు ఉన్నాయి. ప్రత్యేక తెలంగాణ అనంతరం జరిగిన 2014 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కేవలం ఒక్క నియోజకవర్గంలోనే విజయం సాధించింది. కొత్తగూడెం నియోజకవర్గంలో ఆ పార్టీ అభ్యర్థి జలగం వెంకట్రావు విజయం సాధించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ కు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పరాభవమే ఎదురైంది. కేవలం ఖమ్మం నియోజకవర్గంలో మాత్రమే బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో తుమ్మల నాగేశ్వరరావు వంటి లీడర్లుసైతం ఓటమి పాలయ్యారు. అయితే, ఈ దఫా 2023 ఎన్నికల్లో పది నియోజకవర్గాల్లో కనీసం ఐదారు నియోజకవర్గాల్లోనైనా బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధిస్తారని అందరూ భావించారు. కానీ, ఖమ్మం ఉమ్మడి జిల్లా ప్రజలు మాత్రం బీఆర్ఎస్ పార్టీకి మరోసారి షాకిచ్చారు.

Also Read : Revanth Reddy: ప్రగతి భవన్ పేరు మారుస్తాం.. ఘన విజయం అనంతరం రేవంత్ తొలి కామెంట్

2023 ఎన్నికలకు కొద్దిరోజుల ముందే.. తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వంటి ముఖ్య నేతలు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ క్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది నియోజకవర్గాల నుంచి ఒక్క బీఆర్ఎస్ అభ్యర్థినికూడా అసెంబ్లీ గేటు దాటనివ్వనని పొంగులేటి శబదం చేశారు. బీఆర్ఎస్ అధిష్టానం మాత్రం ఈ దఫా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కనీసం ఐదు నుంచి ఆరు స్థానాల్లో అభ్యర్థులు విజయం సాధిస్తారని భావించింది. కానీ, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు 2014, 2018 ఎన్నికల తరహాలోనే 2023 ఎన్నికల్లోనూ కేవలం ఒక్క నియోజకవర్గానికే బీఆర్ఎస్ అభ్యర్థిని పరిమితం చేశారు. ఈ దఫా భద్రాచలం నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించారు. మిగిలిన తొమ్మిది నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ఓటమి పాలయ్యారు.

 

 

ట్రెండింగ్ వార్తలు