Telangana : గోదారమ్మ ఉగ్రరూపం..భద్రాచలానికి భారీ వరద హెచ్చరిక..

గత ఐదు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలకు గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో గోదావరి నది తీరాన ఉన్న భద్రాచలానికి భారీ వరద హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. గోదావరి నీటి మట్టం 64 అడుగులు దాటే అవకాశాలు ఉండటంతో కలెక్టర్ కీలక ఆదేశాలు జారీ చేశారు.

Flood Threat Looming In Bhadradri District (2)

flood threat looming in Bhadradri district : గత ఐదు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలకు గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో గోదావరి నది తీరాన ఉన్న భద్రాచలానికి భారీ వరద హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. గోదావరి నీటి మట్టం 64 అడుగులు దాటే అవకాశాలు ఉండటంతో కలెక్టర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు అమ్రమత్తంగా ఉండాలని సూచించారు. లోతట్టు ప్రాంతాలల్లో ఉండే ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కోవటానికి ప్రజలకు ఎటువంటి ప్రమాదాలు రాకుండా ఉండేలా సహాయక చర్యలకు అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు.

ఐదురోజులుగా కొండకు చిల్లు పడినట్లుగా కురుస్తున్న వర్షాలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జనజీవనం స్తంభించింది. ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నదితో పాటు దాని ఉప నదులైన కిన్నెరసాని, తాలిపేరు, పెదవాగు, ముర్రేడు ఇతర చిన్నచిన్న వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. గోదావరి ఎగువ ప్రాంతంలోని సాగు నీటి ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు చేరుతోంది. జలాశయాల నుంచి వరద నీటిని వదులుతుండటంతో భద్రాచలం వద్ద గోదావరి నది ఉగ్రరూపంతో ప్రవహిస్తోంది. గత నాలుగు రోజులుగా భద్రాచలం వద్ద పెరుగుతూ వస్తున్న గోదావరి నీటి మట్టం మూడో ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరుకుంది.
సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు 53 అడుగులు దాటడంతో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మంగళవారం అర్ధరాత్రి నుంచి నిలకడగా ఉంటున్న గోదావరి నీటిమట్టం మంగళవారం ఉదయం 8.35 గంటలకు 52.9అడుగులకు చేరుకున్న క్రమంలో ఈక్రమంలో గోదావరి నీటి మట్టం 64 అడుగులకు చేరే అవకాశం ఉండటంతో కలెక్టర్లతో పాటు అధికారంతా అప్రమత్తమయ్యారు.

గోదావరి ఎగువ ప్రాంతాలలోని జలాశయాల నుంచి భారీగా వరద నీరు విడుదల చేస్తుండటంతో మంగళవారం రాత్రి నుంచి భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం మళ్లి మూడో ప్రమాద హెచ్చరిక స్థాయి దాటి ప్రవహించే అవకాశాలు ఉన్నట్లు కేంద్ర జల వనరుల సంఘం అధికారులు అంచనా వేస్తున్నారు. గత నాలుగు రోజుల నుంచి పెరుగుతూ వస్తున్న గోదావరి నీటిమట్టం పెరుగుతోంది.